జగిత్యాల నవంబర్ 09
గంజాయి రవాణా, విక్రయాల మూలాలు, కీలక వ్యక్తుల పై పటిష్ట నిఘా ఉంచాలని ,గంజాయి సాగు,రవాణా,నిలువ,
విక్రయం,వినియోగం చట్టరీత్యా నేరం ఆని ఇట్టి నేరాలు ఎవరైనా పాల్పడిన వారికి
1సం” నుండి 20 సం” వరకు కఠిన కారాగార శిక్ష తోపాటు 1లక్ష నుండి 2లక్షల వరకు జరిమానా విధిస్తామని జిల్లా ఎస్పీ సీంథుశర్మ ఆన్నారు. మంగళవారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో గంజాయి నిర్మూలన అవగాహన సీడీ మరియు పోస్టర్ ను జిల్లా ఎస్పీ సింధు శర్మ ఆవిష్కరించారు.
ఈ సంద్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో, రాష్ట్ర సరిహద్దుల నుండి వచ్చే గంజాయి సరఫరా చేసే మూలాలను, కీలక వ్యక్తులను గుర్తించి వారిపై కేసులు నమోదు చేసి అక్రమ రవాణా పకడ్బందీగా నియంత్రించాలన్నారు.
ప్రతి పోలీస్ అధికారి తమ ఏరియాలో గంజాయి సాగు మరియు రవాణా వినియోగం పై నిఘా ఉంచి వాటిని అరికట్టేందుకు ఎక్సైజ్ శాఖ,ఫారెస్ట్, గ్రామ సర్పంచ్, లతో సమన్వయం చేసుకుని గంజాయిని నిరోధించే విధంగా చూడాలని అన్నారు. మారుమూల ప్రాంతాల్లో కొందరు వ్యక్తులు మిర్చి, పత్తి సాగు తో పాటు గంజాయిని సాగు చేసే అవకాశం ఎక్కువగా ఉన్నందున వాటిపై నా ఎక్కువగా ఫోకస్ చేయాలని సూచించారు. నిర్మానుష్య ప్రదేశాల్లో పాడుబడ్డ భవనాలలో యువత ఎక్కువగా గంజాయి తీసుకునే అవకాశం ఉన్నందున వాటిపై నిఘా పెట్టాలన్నారు. గంజాయి సేవించేవారు ప్రత్యేకంగా వాట్సప్ గ్రూపు ఏర్పాటు చేసుకుంటున్నారని వారి కదలికలపై నిఘా పెట్టాలన్నారు. జిల్లాలో గంజాయి సేవించే వారి డేటా ను కలెక్ట్ చేసి వారి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సెలింగ్ నిర్వహించాలని మరల అదే విధంగా చేస్తే వారిపై కేసులు నమోదు చేయాలని సూచించారు.తల్లిదండ్రులు పిల్లల ప్రవర్తన పై దృష్టి సారించాలని వారి కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలని తల్లిదండ్రులను కోరారు.గంజాయి నివారణ గురించి ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకుని జిల్లాను గంజాయ్ రహిత జిల్లాగా మార్చాలని అధికారులను ఆదేశించారు.గంజాయి నిర్మూలన అవగాహన సీడీ మరియు పోస్టర్ ను రూపొందించిన మాల్యాల సి.ఐ రమణమూర్తి ని జిల్లా ఎస్పీ అభినందించారు.ఈ కార్యక్రమంలో అడ్మిన్ ఎస్పీ కె. సురేష్ కుమార్, డిఎస్పీ ప్రకాష్,మాల్యాల సి.ఐ రమణమూర్తి, ఆర్ఐ వామనమూర్తి పాల్గొన్నారు.