ములుగు డిసెంబర్ 2
ములుగు మండలం బండారుపల్లి గ్రామంలోని ఉప ఆరోగ్య కేంద్రాన్ని ఎయిడ్స్ లెప్రస్ కంట్రోల్ జిల్లా అధికారి డాక్టర్ పోరిక రవీందర్ గురువారం ఉదయం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అన్ని రికార్డులతో పాటు కుష్ఠు వ్యాధికి సంబంధించిన రికార్డులను పరిశీలిం చారు. కేసుల వివరాలను ఏఎన్ఎం సత్యనారాయణమ్మ ద్వారా తెలుసుకున్నారు.
ప్రజలు కుష్ఠువ్యాధిపై అవగాహన కలిగి ఉన్న ప్పుడే వ్యాధి నయం అవుతుందని ఎయిడ్స్ కంట్రోల్ కుష్ఠువ్యాధి నివారణ అధికారి డాక్టర్ రవీందర్ పేర్కొన్నారు. రికార్డులను పరిశీలించిన ఆయన మాట్లాడుతూ చర్మం పాలిపోయినా, లేక రాగివర్ణంలో పొడలు, మచ్చలు, స్పర్శ లేకున్నా, చెమట పట్టినా కుష్ఠువ్యాధి లక్షణాలుగా నిర్ధారించవచ్చన్నారు. ఈ వ్యాధిని బహుళ ఔషధ చికిత్స ద్వారా నివారించవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ప్రమోద్ ఏఎన్ఎం సత్యనారాయణమ్మ ఆశా కార్యకర్తలు మంజుల, రమ తదితరులు పాల్గొన్నారు