Home తెలంగాణ సుభాష్ మృతిపట్ల సమాచారపౌర సంబంధాల శాఖ సంతాపం

సుభాష్ మృతిపట్ల సమాచారపౌర సంబంధాల శాఖ సంతాపం

133
0

హైదరాబాద్
రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ డైరెక్టర్ గా  పదవీ విరమణ పొందిన ఊటుకూరు సుభాష్ శుక్రవారం సాయంత్రం మృతి చెందారు. తీవ్ర అనారోగ్యానికి గురైన సుభాష్ ను వారం క్రితం హైదరాబాద్ లోని ఒక ప్రవేటు హాస్పిటల్ లో చేర్పించారు. చికిత్స పొందుతూ ఆయన మృతిచెందారు. సుభాష్ కు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. హైదరాబాద్ లో నివసిస్తున్నారు.సమాచార పౌర సంబంధాల శాఖలో వివిధ హోదాలలో  దాదాపు 35 సంవత్సరాల పాటు సుభాష్ పని చేసి, డైరెక్టర్ గా 2017 లో పదవీ విరమణ చేశారని, అటు ఉన్నతాధికారులు, పాత్రికేయుల మన్ననలు పొందారు. మన సంస్కృతి, సంప్రదాయాలు, కళలపై  సుభాష్ కు మక్కువ ఎక్కువని అదనపు సంచాలకులు నాగయ్య కాంబ్లె తెలిపారు. సుభాష్ కుటుంబానికి మనోస్టైర్యాన్ని కల్పించాలని భగవంతుని ప్రార్ధిస్తున్నట్లు నాగయ్య తెలిపారు. సుభాష్ మృతిపట్ల ఆ శాఖ అదనపు సంచాలకులు నాగయ్య కాంబ్లె, కిషోర్ బాబు, సంయుక్త సంచాలకులు డి. ఎస్. జగన్, వెంకటేశ్వరరావు, శ్రీనివాస్, ఇతర అధికారులు, సిబ్బంది సంతాపం తెలిపారు.

Previous articleకాలాన్ని బట్టి రైతులు పంట మార్పిడి చేయాలి జడ్పీ వైస్ చైర్మన్ హరి చరణ్ రావు
Next articleదేశంలో తగ్గుముఖం పడుతున్న కారోనా.. కొత్తగా 29,616 కేసులు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here