న్యూఢిల్లీ నవంబర్ 26 (
జమ్మూ తావి దుర్గ్ – ఉధంపూర్ ఎక్స్‌ప్రెస్‌లో శుక్రవారం సాయంత్రం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సాయంత్రం 4 గంటల సమయంలో రెండు ఏసీ కోచ్‌లలో మంటలు అంటుకున్నాయి. క్షణాల్లోనే మరో రెండు ఏసీ కోచ్‌లకు మంటలు వ్యాపించడంతో.. ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.రాజస్థాన్‌లోని ధౌల్‌పూర్, మధ్యప్రదేశ్‌లోని మోరినా మధ్య ఈ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. హేతంపూర్ నుంచి ఝాన్సీ రైలు వెళ్తుండగా అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేసింది. అయితే ఓ కోచ్‌లోని ఏసీలో మంటలు చెలరేగడంతోనే ఈ ప్రమాదం సంభవించినట్లు పోలీసులు నిర్ధారించారు.