కాకినాడ
కాకినాడ నగరపాలక సంస్థ మేయర్ గా సుంకర శివ ప్రసన్న ఎన్నికయ్యారు. నేడు జరిగిన మేయర్ ఎన్నికల్లో శివ ప్రసన్న పేరు ప్రతిపాదించడంతో ఎకగ్రీవంగా ఎన్నికైనట్టు రిటర్నింగ్ అధికారి, జాయింట్ కలెక్టర్ లక్ష్మీషా ప్రకటించారు. అలాగే డిప్యూటీ మేయర్ గా మీసాల ఉదయ్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తన ఎన్నికకు కారణమైన ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి , మంత్రులు కార్పొరేటర్ల కు మేయర్ శివ ప్రసన ధన్యవాదాలు తెలిపారు. ప్రజలకు అందుబాటులో ఉంటానన్నారు