సుర్యాపేట
సూర్యాపేట జిల్లాకు చెందిన ఓ యువకుడు మలేషియాలో మృతి చెందాడు. సూర్యాపేట పట్టణానికి చెందిన మోటకట్ల వెంకటరమణారెడ్డి, మాధవిల కుమారుడు రిశివర్ధన్ రెడ్డి(21).. నేవీలో ఉద్యోగం సంపాదించి మలేషియా కు చెందిన ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. సదరు ప్రైవేటు షిప్ సరుకు రవాణా కోసం వెళ్తున్న క్రమంలో.. షిప్పై నుంచి సముద్రంలో పడిపోవడంతో మృతి చెందినట్లు తల్లిదండ్రులకు ఫోన్ లో సమాచారం అందించారు మలేషియా అధికారులు. దీంతో మృతుడి స్వస్థలం సూర్యాపేట పట్టణంలోని నివాసంలో విషాద ఛాయలు తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు రిషి వర్ధన్ రెడ్డి మరణం పై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం నుంచి తమకు సహాయ సహకారాలు అందించాలని వేడుకుంటున్నారు.