ఎంపీడీఓ
బేతంచెర్ల
మండలంలో ఏకగ్రీవంగా ఎన్నికైన 15 మండల ప్రజా పరిషత్ సభ్యులకు ఈ నెల 24 వ తేదీన ప్రమాణ స్వీకారం ఉంటుందని, కావున ఎన్నికైన సభ్యులు మాత్రమే ఎంపీడీఓ కార్యాలయానికి హాజరవ్వాలని ఎంపీడీఓ ఆశ్విన్ కుమార్, ప్రొసీడింగ్ అధికారి రమణ మూర్తి సోమవారం పత్రికా ప్రకటన లో వెల్లడించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అదే రోజు మండలాధ్యక్షుడు,ఉపాధ్యక్షుడు ఎన్నిక ఉంటుందని, అందుకు సంబంధించిన ముసాయిదాను కూడా సిద్ధం చేశామని, వీరి ఎన్నిక తరువాత కో అప్షన్ సభ్యుని ఎన్నిక కూడా ఉంటుందని,ఎన్నికైన సభ్యులు ప్రమాణ స్వీకారం తర్వాత వచ్చే సమావేశాలకు కోరం పాటించాలని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్సై శ్రీనివాసుల,తదితరులు పాల్గొన్నారు.