కోరుట్ల జనవరి 24
ఈ నెల 23 న కోరుట్ల వాలీబాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సయ్యద్ సహీద్ మెమోరియల్ వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించారు.ఈ పోటీలలో మెట్ పెల్లి, కథలాపూర్, కోరుట్ల మండలాలకు చెందిన జట్టులు పాల్గొన్నాయి.. ఈ టోర్నమెంట్లో ఫైనల్ మ్యాచ్ కోరుట్ల బిలాల్ పుర వర్సెస్ ఊట్పల్లి జట్టుతో తలపడగా కోరుట్ల పట్టణానికి చెందిన బిలాల్ పుర జట్టు మొదటి స్థానం కైవసం చేసుకోగా ,రెండవ స్థానం ఊట్పల్లి కైవసం చేసుకుంది. కోరుట్ల వాలీబాల్ అసోసియేషన్ అధ్యక్షులు గంగాధర్ , లక్ష్మీనారాయణ, సల్మాన్ ఖాన్ ,రాజేష్ , ఆమేర్ అలీలు విజేతలకు బహుమతులు ప్రధానం చేశారు.అలాగే ఇటీవల మృతి చెందిన
సయ్యద్ సాహెద్ కు క్రీడాకారులు,అసోసియేషన్ సభ్యులు నివాళులర్పించినట్లు వాలీబాల్ అసోసియేషన్ సెక్రటరీ ఎంఏ భారీ తెలిపారు