విజయవాడ
తాడేపల్లి అంజిరెడ్డి కాలనీలో గతకొన్నేళుగా భర్త చనిపోయిన ఇందిర తో కలసి సహజీవనంచేస్తూన కట్టా రాజా తన ప్రియురాలు కొడుకు చేతిలో హతమయ్యాడు. డిసెంబర్ 26వ తారీకు అనుమానాస్పద స్థితిలో చికిత్స పొందుతూ మృతి చెందిన కట్ట రాజా హత్య కేసులో ప్రియురాలు, ఆమె కొడుకే నిందితులుగా తాడేపల్లి పోలీసులు తేల్చారు. తల్లి ఇందిర, కొడుకు వంశీ వర్దన్ను తాడేపల్లి పోలీసులు అరెస్టు చేసారు. బందువులను నమ్మించి గుట్టుచప్పుడు కాకుండా ప్రియుడు మృతదేహాన్ని ఖననం చేసారు. ప్రియురాలు ఇందిర కార్యక్రమం ముగిసిందని అనుకుంది. డిసెంబర్ 27 వతారీకు అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేసారు. ప్రియురాలు ఇందిరా అతని కొడుకు పై అనుమానం తో పోలీసులు తమదైన శైలిలో విచారణ చేసారు. మృతుడు రాజా శరీరంపై కత్తిపోట్లు ఉండడంతో పోస్టుమార్టం నివేదిక ఆధారంగా పోలీసులు తమదైన శైలిలో ప్రియురాలిని విచారించగా హత్య చేసినట్లు నిర్ధారణ అయింది. మద్యం సేవించిన మత్తులో కట్టా రాజా , ప్రియురాలు కొడుకు వంశీవర్ధన్ కు మద్య జరిగిన ఘర్షణలో కొడుకు వంశివర్దన్ కత్తితో రాజాను విచక్షణారహితంగా పొడిచినట్లు కొడుకును కాపాడే ప్రయత్నం లోనే రాజా కు ఆరోగ్యం బాగా లేదని చికిత్స పొందుతూ మరణించాడని నాటకమాడి ఎట్టకేలకు పోలీసులు చిక్కిపోయింది. కేసు ను చేదించించిన తాడేపల్లి సిఐలు శేషగిరిరావు సాంబశివరావు మరియు ఎస్ఐ లు వినోద్ కుమార నారాయణను డి.ఎస్.పి రాంబాబు అభినందించారు.