ఎమ్మిగనూరు
పట్టణంలో వైడబ్ల్యుసి గ్రౌండ్ ఆవరణంలో ఏర్పాటు చేసిన టపాకాయల దుకాణాల స్థల ఆవరణాన్ని ఉదయం మండల తహశీల్దార్ బి. జయన్న,అగ్నిమాపక శాఖ అధికారి మోహన్ బాబు పరిశీలించారు. నవంబర్ 4వ తేదీన జరిగే దీపావళి పండుగ సందర్భంగా టపాకాయల క్రయ విక్రయాలు జరిపే దుకాణాల యాజమాన్యం వారు ప్రతి దుకాణం వారు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రమాదాలు జరగకుండా ఇసుక బకెట్లు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఆర్ ఐ. రామయ్య,ట్రాఫిక్ ఎస్ఐ. అబ్దుల్ జహీర్ ,తదితరులు పాల్గొన్నారు.