అమరావతి మార్చ్ 7
);: టీడీపీ వారికి ఆవేశం ఎక్కువని, క్షణికావేశంలో నిర్ణయాలు తీసుకుంటారని మంత్రి బొత్స సత్యనారాయణ ఎద్దేవా చేశారు. టీడీపీ నేతలు ఎప్పుడు ప్రజల కోసం, దీర్ఘకాల నిర్ణయాలు తీసుకోరని విమర్శించారు. ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా మంత్రి బొత్స నారాయణ సచివాలయం వద్ద మీడియాతో మాట్లాడుతూ.. ‘ చంద్రబాబు స్వార్ధం కోసం నిర్ణయాలు తీసుకుంటారు.ప్రజల కోసం, దీర్ఘకాల నిర్ణయాలు వారు తీసుకోరు.శాసనసభ చట్టాలను చేయవద్దంటే ఎలా కుదురుతుంది. రాజ్యాంగానికి లోబడే వ్యవస్థ అయినా పని చేయాలి. ఇది చర్చనీయాంశం. దీనిపై చర్చ జరగాలి. 2024 వరకు ఉమ్మడి రాజధాని హైదరాబాదు అని చట్టం చేశారు. శివరామకృష్ణ కమిటీని వేసి రాజధాని నిర్ణయం తీసుకోవాలన్నారు. కానీ చంద్రబాబు నారాయణ కమిటీ వేసి నిర్ణయం తీసుకున్నారు. ఆ ప్రకటన ఏదైనా పార్లమెంట్‌కు పంపలేదు. కాబట్టి హైదరాబాదే 2024 వరకు రాజధానే. గత ప్రభుత్వం రాజధాని వ్యవహారం లో చట్టబద్ధంగా వ్యవహరించలేదు.పరిపాలన సౌలభ్యం కోసం జిల్లాల పునర్విభజన చేస్తున్నాం’ అని బొత్స తెలిపారు