అమరావతి
ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు వీడాలంటూ టీడీపీ శాసన సభ్యులు నినాదాలు చేపట్టారు. నిరసన ప్రదర్శనలో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, శాసనసభ్యులు బ్యానర్ పట్టుకుని అసెంబ్లీ వరకు పాదయాత్రగా వచ్చారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ భారంగా మారిన పెట్రో ధరలు తగ్గించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలో పెట్రోల్, డీజిల్ ధరలు అత్యధికంగా ఉన్నాయన్నారు. జగన్ ప్రభుత్వం ప్రజలపై పన్నుల భారం వేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. చెత్తపై పన్ను వేసిన చెత్త ప్రభుత్వం అంటూ టీడీపీ అధినేత మండిపడ్డారు. ప్రజావ్యతిరేక ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం కొనసాగిస్తామని అన్నారు. చెత్తపై పన్ను వంటి నిర్ణయాలు వెనక్కి తీసుకోవాలన్నారు. సామాన్యులు ఈ పాలనలో చితికి పోతున్నారని అన్నారు. విద్యుత్ చార్జీలు కూడా ఏపీలో ఎక్కవే అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.