Home ఆంధ్రప్రదేశ్ బుగ్గవంకను పరిశీలించిన టీడీపీ బృందం

బుగ్గవంకను పరిశీలించిన టీడీపీ బృందం

345
0

కడప నవంబర్ 12
కడప నగర మధ్యన ఉదృతంగా ప్రవహిస్తున్న బుగ్గవంకను  కడప నియోజకవర్గ ఇన్చార్జ్ అమీర్ బాబు, కడప నగర అధ్యక్షులు సానపురెడ్డి శివకొండరెడ్డి, తెలుగుదేశం నాయకులు  పరిశీలించారు. ఈ సందర్భంగా బాబు మాట్లాడుతూ బుగ్గవంక డ్యాం నుంచి నీటిని వదిలిన ప్రతిసారి బుగ్గవంక ఇరువైపులా ఉన్న లోతట్టు ప్రాంతాలు జలమయం అవుతున్నాయి కడప జిల్లా మాకు పెట్టని కోట అని గొప్పలు చెప్పుకునే వైయస్ కుటుంబం నుంచి ఎంపీలు, ఎమ్మేల్యేలు, మేయర్లు, ముఖ్యమంత్రులు ఇలా వారి కుటుంబ సభ్యులు పోందని పదవులు లేవు అనుభవించని హోదా లేదు వారి కుటుంబం ఆస్తులు పెంచుకోవడం తప్ప ప్రజల కష్టాల గురించి కూడా ఆలోచించి ఉంటే ఎంతో బాగుండేది మూడు పర్యాయాలుగా కడప నగర మేయర్లు గా గతంలో కాంగ్రెస్ ఇప్పుడు వైసీపీని ప్రజలు ఎన్నుకుంటూ వచ్చారు కానీ బుగ్గవంక డ్యాం నుంచి నీరు వదిలిన ప్రతిసారీ  ప్రజలకు ఈ వరద ముప్పు తప్పడం లేదు  వరద ముప్పు నుంచి తప్పించే రక్షణ గోడ పూర్తి చేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా చేసే ఉద్దేశం పాలకవర్గానికి లేదు. గతంలో ఎన్నోసార్లు కార్పొరేషన్ అధికారులకు కడప నగర మేయర్లకు వినతి పత్రాలు ప్రజలు, ప్రజా సంఘాలు, ప్రతిపక్షాలు వినతి పత్రాలు, నిరసనలూ తెలిపినా నిమ్మకు నీరెత్తినట్టు ఉన్నారు తప్ప ప్రజలకు కనీస వరద ముప్పు లోతట్టు ప్రాంతాల ప్రజలకు ముంపు కష్టాలనూ తీర్చలేని దుర్బర పరిస్థితుల్లో ఉన్నారు ఒక గంట గట్టిగా వర్షం పడితే చాలు అస్తవ్యస్తంగా ఉన్న డ్రైనేజీ వ్యవస్థ వల్ల కడప నగరం వివిధ ప్రాంతాల్లో మోకాలి లోతు నీళ్లు నిలబడి ప్రజలకు ఇబ్బందులకు గురి చేస్తాయి  లేని  ఇకనైనా బుగ్గవంక రక్షణతో పాటు సరైన డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేసి లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురికాకుండా ప్రజలను కాపాడాలని వారి సమస్యలను పట్టించుకోవాలని ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వానికి కడప నగర మేయర్ కు విజ్ఞప్తి చేస్తున్నాంమని అన్నారు. .

Previous articleగురజాల, దాచేపల్లిలో పర్యటించిన ఎస్పీ విశాల్ గున్ని
Next articleమార్చి చివరి నాటికి మెడికల్ కళాశాల తాత్కాలిక భవన నిర్మాణం పూర్తి చేయాలి జిల్లా కలెక్టర్ జి.రవి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here