జగిత్యాల, అక్టోబర్ 02
: గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని తెలంగాణలో రాష్ట్రం సాధించిందని జిల్లా పరిషత్ చైర్మన్ దావ వసంత అన్నారు. శనివారు అంతర్గాం గ్రామంలో బతుకమ్మ చీరల పంపిణి కార్యక్రమంలో ముఖ్య అతిధులుగా
జిల్లా పరిషత్ చైర్మన్ దావ వసంత,జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్. సంజయ్ కుమార్, జిల్లా కలెక్టర్ గోగులోత్ రవి ,గ్రందాలయ చైర్మన్ డా.చంద్రశేఖర్ గౌడ్ పాల్గోని ,ఈసందర్భంగా జిల్లా పరిషత్ చైర్మన్
మాట్లాడుతూ, దేశానికి పట్టుకొమ్మలు గ్రామాలే అని, గాంధీజీ కలలుగన్న గ్రామస్వరాజ్యాన్ని తెలంగాణ రాష్ట్రం అచరణలో చూపించిదని అన్నారు. అభివృద్ది సంక్షేమ పథకాల ద్వారా అభివృద్దిలో ముందుందని, గ్రామప్రజల మానసిక ఉళ్లాసానికి ప్రకృతి వనాలు ఏర్పాటు చేయడం, పిల్లలు చదువులో మరింత అభివృద్ది చెందేలా కంప్యూటర్లు ల్యాబులను ఏర్పాటు చేయడం, డిజిటల్ క్లాసుల ద్వారా తరగతులను నిర్వహించడం వంటి అనేక సదుపాయాలను సమకూర్చడంతో పాటు ఆటల్లోను ప్రోత్సహించే విధంగా ఫుడ్ బాల్, వాలిబాల్ మొదలగు మౌళిక సదుపాయాలను కల్పించడం జరుగుతుందని పేర్కోన్నారు. ప్రపంచంలో పూలను పూజించే సంస్కృతి కేవలం తెలంగాణలో మాత్రమే ఉందని, అంతటి విశిష్టత కలిగిన బతుకమ్మ పండుగను ఆడే ఆడపడుచుల కొరకు ప్రత్యేకంగా నేతన్నలతో 289 డిజైన్లతో బతుకమ్మ చీరలను నేయించి ఆడపడుచులకు పంపిణి చేయడం జరుగుతుందని పేర్కోన్నారు. సరైన ఆదరణలేని నేతన్నల అభివృద్దిని ఆకాంక్షించి వారిద్వారా 289 రకాల చీరలను తయారు చేయించి నేత కార్మికుల ఆర్థిక ఎదుగుదలకు తోడ్పడం జరుగుతుంది పేర్కోన్నారు.
జిల్లా కలెక్టర్ జి. రవి మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత బతుకమ్మ పండుగను ఘనంగా జరుపుకుని తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాన్ని చాటిచెప్పేలా బతుకమ్మ పండుగను నిర్వహించుకునేలా, 18 సంవత్సరాలు నిండి, ఆహార భద్రతకార్డుదారులైన ప్రతిఒక్కరికి బతుకమ్మ చీరలను అందించడం జరుగుతుందని, జిల్లా వ్యాప్తంగా 382403 మహిళలందరికి బతుకమ్మ చీరలను పంపిణి చేసే కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని, చీరల పంపిణి కార్యక్రమం ఒక్కరోజు కొరకు నిర్వహించే కార్యక్రమం కాదని, అర్హులై ప్రతి ఒక్కరికి చీరలు అందేలా కౌటర్లను ఏర్పాటు చేయడం జరుగుతుందని, ప్రజలు పండుగను ఘనంగా జరుపుకునేలా నేతకార్మికులతో తయారుచేయించబడిన చీరలను ఒక్క జగిత్యాల జిల్లాకే 382403 చీరలను పంపిణి చేయడం జరిగిందని పేర్కోన్నారు. ప్రభుత్వ పరంగా అమలు చేయబడుతున్న ప్రతి అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెట్టడం జరుగుతుందని తెలియజేశారు.
జగిత్యాల శాసన సభ్యులు డా. యం. సంజయ్ కుమార్ మాట్లాడుతూ, ఎస్సీల అభివృద్ది కొరకు రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ద్వారా వివిధ అభివృద్ది కార్యక్రమాలున ప్రవేశపెట్టడం జరిగిందని పేర్కోన్నారు. కేవలం అంతర్గాం గ్రామానికి ఒకనెలకు పించన్ల ద్వారా 12 లక్షల యాబై వేలు మంజరువుతుందని, పెట్టుబడి సాయంగా 2వేల ఎకరాలు భూములకు 2 కోట్లు అందించడంతో పాటు, 24 గంటల విద్యూత్ అంధించడం జరుగుతుందని పేర్కోన్నారు. 60 ఎళ్లలోపపు చనిపోయిన రైతులకు ఆర్థిక సహయాన్ని అంధించడం జరిగిందని అన్నారు.
కాళేశ్వరం ప్రాజేక్టు ద్వారా కాలువలలో సమృద్దిగా నీళ్లతో చిన్న వరుద కాలువ కాస్తా చిన్నపాటి గోదావరి నదిగా అభివృద్ది చేందిందని పేర్కోన్నారు. గతంలో 90 ఎకరాల భూమిలో సాగు పనులు జరిగేవని కాని ఇప్పడు దాదాపు 8వందల ఎకరాలలో పంటపండించడం జరుగుతుందని, గత సంవత్సరం 28600 క్వింటాళ్ల పంటను కొనుగోలు చేయడం జరిగిందని, తద్వారా ప్రభుత్వం 25వేల కోట్లరూపాయలను ఫుడ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా నుండి ఋణాన్ని పొందిందని అన్నారు. వివిధ అభివృద్ది కార్యక్రమా ద్వారా 4 కోట్ల రూపాయను ప్రతిరోజు ప్రభుత్వ తెలంగాణ రైతుల కొరకు బ్యాంకులకు అప్పులు కట్టడం జరిగిందని పేరోన్నారు. హరితహారం కార్యక్రమం ద్వారా జగిత్యాల జిల్లాలో 25 లక్షల ఈత మొక్కలు నాటడం జరిగిందని, కేవలం అంతర్గాం గ్రామంలో 2016/- బ్యాంకుఖాతాల ద్వారా అంధిండం జరిగిందని, ప్రతిఒక్కరు వృతివిద్యపై నైపుణ్యాన్ని సాధించడం జరుగుతుందని, వృత్తి నైపుణ్యాలు మాత్రమే కాకుండా మహిళకు కుట్టుమిషన్లను అందించడం జరుగుతుందని, మాల, మాదిగల అభివృద్ది కొరకు 60వేల బ్యాంకు ఋణంతో పాటు సబ్సిడిపై పాడిగేదేలను అందిస్తుందని పేర్కోన్నారు. రైతులు పండించిన కూరగాయలను అమ్ముకునేలా రైతుబజార్ లను ఏర్పాటు చేయడం జరిగిందని, జిల్లాలో వైద్యసేవలను అందించేలా దరూర్ లో భూమిని కూడా మంజూరు చేయడం జరిగిందని, ప్రతియాడాది అంతర్గాం గ్రామానికి వివిధ పథకాల రూపంలో 4కోట్లరూపాయలు వస్తున్నాయని పేర్కోన్నారు.
గ్రందాలయ చైర్మన్ డా.చంద్రశేఖర్ గౌడ్ మాట్లాడుతూ, బతుకమ్మ పండుగ, బతుకమ్మ చీరల పండుగగా మారిందని, తెలంగాణ పెద్ద పండుగ సందర్బంగా మన మహిళను గౌరవించుకోవాల్సిన అవసరం ఎంతైన ఉందని, ప్రభుత్వ ప్రవేశపెడుతున్న ప్రతిపథకానికి కార్యరూపందాల్చి క్షేత్రస్థాయిలో కృషిచేస్తున్న జిల్లా కలెక్టర్ గారికి, జగిత్యాల ఎమ్మెల్యే గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
కార్యక్రమంలో అంతకు ముందు అంతర్గాం గ్రామంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో 3లక్షల 50 వేలతో ఏర్పాటు చేసిన బాస్కెట్ బాల్ కోట్, మాకునూరి సందీప్ కుమార్ గారు 2లక్షల 50వేలతో వితరణ చేసిన కంప్యూటర్ 4 కంప్యూటర్లను ప్రారంభించి, ప్రొజెక్టర్ ద్వారా నిర్వహించే తరగతులను పరిశీలించారు. అనంతరం ఎస్సి కార్పోరొషన్ సహాకారంతో ఉచిత కుట్టు మిషన్ శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. చివరగా అధికారులు, ప్రజాప్రతినిధులు బతుకమ్మను ఆడారు.
ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అధనపు కలెక్టర్ శ్రీమతి జె. అరుణశ్రీ, జగిత్యాల ఆర్డిఓ శ్రీమతి ఆర్.డి. మాదురి, పిడి డిఆర్డిఓ ఎస్. వినోద్, ఇడి ఎస్సికార్పోరేషన్ లక్ష్మీనారాయణ, సర్పంచ్ నారాయణ, ఎంపీపీ రాజేంద్రప్రసాద్,ఏఎంసీ చైర్మన్ దామోదర్ రావు పీఏసీఎస్ చైర్మన్ లు మహిపాల్ రెడ్డి, సందీప్ రావు, రైతు బంధు మండల కన్వీనర్ రవీందర్ రెడ్డి, ఎంపీటీసీ శ్రీనివాస్, ఉప సర్పంచ్ శేఖర్ రెడ్డి, అధికారులు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.