Home తెలంగాణ బీసీ కుల‌గ‌ణ‌న చేప‌ట్టాల‌ని తెలంగాణ అసెంబ్లీ ఏక‌గ్రీవ తీర్మానం

బీసీ కుల‌గ‌ణ‌న చేప‌ట్టాల‌ని తెలంగాణ అసెంబ్లీ ఏక‌గ్రీవ తీర్మానం

183
0

హైద‌రాబాద్ అక్టోబర్ 8
జ‌నాభా లెక్క‌ల్లో భాగంగా బీసీ కుల‌గ‌ణ‌న చేప‌ట్టాల‌ని తెలంగాణ అసెంబ్లీ ఏక‌గ్రీవ తీర్మానం చేసి ఆమోదించింది. జ‌నాభా గ‌ణ‌న‌లో బీసీల కుల గ‌ణ‌న కూడా చేయాల‌ని కేంద్రాన్ని కోరుతూ సీఎం కేసీఆర్ శాస‌న‌స‌భ‌లో తీర్మానం ప్ర‌వేశ‌పెట్టారు.2021 జ‌నాభా లెక్క‌లు చేయ‌బోతున్నారు. ఇప్ప‌టికే ప‌లు అసెంబ్లీలు, ప‌లు రాజ‌కీయ పార్టీలు ఏక‌గ్రీవంగా కేంద్రానికి తీర్మానాలు పంపిస్తున్నాయి. బీసీ జ‌న‌గ‌ణ‌న‌పై ఏక‌గ్రీవ తీర్మానం చేయాల‌ని మ‌న స‌భ్యులు కూడా చెప్పారు. మ‌న రాష్ట్రంలో బీసీలు అత్య‌ధికంగా 50 శాతం వ‌ర‌కు ఉన్నారు. బీసీల్లో అణ‌గారిన‌, పేద కులాలు అనేకం ఉన్నాయి. బీసీల‌కు అనేక రంగాల్లో న్యాయం జ‌ర‌గాలి. బీసీ కుల గ‌ణ‌న చేయాల‌ని తీర్మానాన్ని ప్ర‌తిపాదిస్తున్నాను అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ఈ తీర్మాన్ని శాస‌న‌స‌భ ఏక‌గ్రీవంగా ఆమోదించింది

Previous articleసమాధులు ఆక్రమణ… ఆక్రమణ దారులపైన చర్యలు తీసుకోవాలి..
Next articleఅసెంబ్లీ లాబీలో పీవీ నర‌సిం‌హా‌రావు చిత్రప‌టం ఆవిష్క‌రణ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here