Home తెలంగాణ డిసెంబ‌ర్ మొద‌టి వారంలో తెలంగాణ హెల్త్ ప్రొఫైల్ కార్య‌క్ర‌మం వైద్యారోగ్య...

డిసెంబ‌ర్ మొద‌టి వారంలో తెలంగాణ హెల్త్ ప్రొఫైల్ కార్య‌క్ర‌మం వైద్యారోగ్య శాఖ అధికారుల‌ను ఆ శాఖ మంత్రి హ‌రీశ్‌రావు

164
0

హైద‌రాబాద్ నవంబర్ 22
డిసెంబ‌ర్ మొద‌టి వారంలో తెలంగాణ హెల్త్ ప్రొఫైల్ కార్య‌క్ర‌మాన్ని ప్ర‌యోగాత్మ‌కంగా ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేయాల‌ని వైద్యారోగ్య శాఖ అధికారుల‌ను ఆ శాఖ మంత్రి హ‌రీశ్‌రావు ఆదేశించారు. ములుగు, సిరిసిల్ల జిల్లాల్లో ఈ కార్య‌క్ర‌మాన్ని ప్ర‌యోగాత్మ‌కంగా ప్రారంభించాల‌ని సూచించారు.తాత్కాలిక స‌చివాలయం బీఆర్కే భ‌వ‌న్‌లో వైద్యారోగ్య శాఖ‌పై మంత్రి హ‌రీశ్‌రావు స‌మీక్షించారు. ఈ స‌మావేశంలో హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ క‌మిష‌న‌ర్ వాకాటి క‌రుణ‌, హెల్త్ డైరెక్ట‌ర్ జీ శ్రీనివాస్ రావు, తెలంగాణ వైద్య విధాన ప‌రిష‌త్ క‌మిష‌న‌ర్ ర‌మేశ్ రెడ్డి, ఓఎస్‌డీ గంగాధ‌ర్‌తో పాటు ప‌లువురు అధికారులు పాల్గొన్నారు.ఈ సంద‌ర్భంగా హ‌రీశ్‌రావు మాట్లాడుతూ.. తెలంగాణ హెల్త్ ఫ్రోపైల్ పక్కాగా రూపొందించాలి అని ఆదేశించారు. తెలంగాణ హెల్త్ ప్రొఫైల్‌లో ప్రస్తుతం ఎనిమిది టెస్ట్‌లు చేస్తున్నారు. ఈ క్ర‌మంలో తెలంగాణ డ‌యాగ్న‌సిస్ సేవ‌ల‌ను కూడా వినియోగించుకోవాల‌న్నారు. ఈ డ‌యాగ్న‌సిస్‌లో ఉప‌యోగించే ప‌రిక‌రాల ద్వారా క‌చ్చిత‌మైన ఫ‌లితాలు వ‌స్తాయ‌న్నారు. హెల్త్ ప్రొఫైల్ సేక‌రించే క్ర‌మంలో ప్ర‌తీ ఇంటికి ఆరోగ్య స‌మాచారం తీసుకోవాల‌న్నారు. నోడల్ ఆఫీసర్లను నియమించి వేగంగా జరిగేలా‌ చర్యలు తీసుకోవాలని మంత్రి చెప్పారు. ఏ వ్యక్తి ఆసుపత్రికి వెళ్లినా, లేదా ఏ వ్యక్తి ప్ర‌మాదానికి గురైనా అతని ఆరోగ్య ‌సమాచారం అంతా క్లౌడ్ స్టోరేజ్ నుండి తెప్పించుకునేలా ఉండాలని మంత్రి హరీశ్ రావు చెప్పారు. అదే రీతిలో‌ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ హెల్త్ ప్రొఫైల్ సమాచారం పకడ్బందీగా సేకరిస్తే ప్రభుత్వం సమర్ధవంతంగా ఆరోగ్య కార్యక్రమాలు నిర్‌ాహించ‌వ‌చ్చు అనేది సీఎం కేసీఆర్ ఆలోచన అని చెప్పారు‌. సమాచారం పక్కాగా ఉంటే రాష్ట్రంలో ఏ ప్రాంతంలో, ఏ వ్యాధులు ఎక్కువ ఉన్నాయి.‌ ఆ ప్రాంతంలో ఎలాంటి వైద్య సేవలు అవసరం, ఎలాంటి మందులు అవసరం, ఎలాంటి వైద్య నిపుణులు, అవసరమైన మెడికల్‌ డివైసెస్ అవసరమో తెలుస్తుందని హ‌రీశ్‌రావు తెలిపారు.
అధికారుల వివ‌ర‌ణ‌
ములుగు, రాజన్న సిరిసిల్ల జిల్లాలలో ప్రయోగాత్మకంగా హెల్త్ ఫ్రోఫైల్ కార్య‌క్ర‌మం వివరాల‌ను హ‌రీశ్‌రావుకు వైద్యారోగ్య శాఖ అధికారులు వివ‌రించారు. ఈ జిల్లాలలో ప్రతీ వ్యక్తి ఆరోగ్య సమాచారం, ఆధార్ నెంబర్, డెమోగ్రాఫిక్ వివరాలు, షుగర్, బీపీతో పాటు ఇతర వ్యాధుల సమాచారం సేకరించనున్నట్లు తెలిపారు. ఈ సమాచారం వల్ల వ్యక్తుల ఆరోగ్యానికి‌ సంబంధించిన రిస్క్ అసెస్మెంట్, హై రిస్క్ వాళ్లను గుర్తించడం జరుగుతుందన్నారు. అనంతరం వారికి అవసరమైవ వైద్య సేవలు అందించడం జరుగుతుందన్నారు. ఈ పరీక్షలు పూర్తయిన త‌ర్వాత వారి ఆరోగ్య సమాచారం‌ డిజిటల్ రూపంలో క్లౌడ్ స్టోరేజి చేయ‌నున్న‌ట్లు పేర్కొన్నారు.
=======================XXకా పకడ్బందీగా తమ నిర్ణయాలు ఉంటాయి
మూడు రాజదానుల పై  మంత్రి బొత్స సత్యానారాయణ
అమరావతి నవంబర్ 22
తాము వెనక్కి తగ్గలేదని, ఆగిపోలేదని మంత్రి బొత్స సత్యానారాయణ స్పష్టం చేశారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ ఇంకా పకడ్బందీగా తమ నిర్ణయాలు ఉంటాయని ప్రకటించారు. శాసనసభలో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, సీఎం జగన్ పూర్తి

స్టేట్మెంట్ ఇచ్చారని తెలిపారు. రాష్ట్ర విభజన తరువాత ప్రజల మనోభావాలు ఏంటి అనేది కూడా సీఎం చెప్పారని పేర్కొన్నారు. ఎక్కడో ఒక దగ్గర అపోహలు ఉన్నాయని, టీడీపీ దుష్ప్రచారాలు చేసిందని బొత్స విమర్శించారు.రాష్ట్ర ప్రజల అందరి

అభిప్రాయాలు తీసుకుని మళ్లీ ముందుకు వస్తామని తెలిపారు. రైతులకు ఇంకా సమస్య ఎక్కడ ఉందని, వాళ్ల మనసుకు తగ్గట్టు తాము అన్ని చేయలేమన్నారు. మాజీ సీఎం చంద్రబాబు నాడు పర్యటనకు వస్తుంటే.. ఏముంది ఇక్కడ స్మశానం తప్ప

అన్నానని, ఆ వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని ఆయన స్పష్టం చేశారు. బీజేపీకి రాష్ట్రంలో స్థానం లేదని, రోజుకో మాట మాట్లాడుతున్నారని బొత్స సత్యనారాయణ మండిపడ్డారు.

Previous articleతెలంగాణ బీజేపీ, కాంగ్రెస్ నాయ‌కుల‌పై మంత్రి నిరంజ‌న్ రెడ్డి ధ్వ‌జం
Next articleదళితులు ముఖ్యమంత్రి పదవికి అర్హులు కాదా? ప్రజా స్వామ్యంలో ప్రజల మనోభావాలే ముఖ్యం సీఎం కేసీఆర్‌స్పష్టం చేయాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here