కామారెడ్డి సెప్టెంబర్ 14
కామారెడ్డి జిల్లాలో బీజేపీ ఆధ్వర్యంలో కామారెడ్డి ఎమ్మార్వో ప్రేమ్ కుమార్ కి సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని
మంగళవారం వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ కుంట లక్ష్మారెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ ఏర్పడక ముందు సెప్టెంబర్17 ను నిర్వహించాలని
ఉద్యమాలు చేసిన కేసీఆర్ తెలంగాణ వచ్చిన తర్వాత మాట మార్చడం విడ్డురామని ఎంఐఎం మెప్పు కోసమే విమోచన దినోత్సవం మారిచారా అని ప్రశ్నించారు. ఇకనైనా తెలంగాణ విమోచన
దినోత్సవాన్ని సెప్టెంబర్ 17 న రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. నిజాం రజాకార్లతో ఆగడాలను, వాటిని నాటి తెలంగాణ పోరాటాయోధులు ఎదుర్కొన్న తీరును,
విమోచన పోరాటాన్ని పాఠ్యంశంగా చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ పోరాటం జరిగిన స్థలాలను స్మృతి కేంద్రాలుగా తీర్చి దిద్దాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ
అధ్యక్షుడు, కౌన్సిలర్లు శ్రీనివాస్, రవి, నాయకులు సురేష్, వెంకట్ రెడ్డి, సంతోష్ రెడ్డి, నవీన్, మహిపాల్, ప్రవీణ్, వేణు, శ్రీకాంత్, నర్సాగౌడ్, మోహన్, భరత్, శరన్, భాస్కర్ తదితరులు
పాల్గొన్నారు.