Home తెలంగాణ తెలుగు అకాడమీ కేసు: మరో 10 మంది అరెస్ట్

తెలుగు అకాడమీ కేసు: మరో 10 మంది అరెస్ట్

268
0

హైదరాబాద్ అక్టోబర్ 9
తెలుగు అకాడమీ కేసులో ఇవాళ మరో నలుగురు నిందితులను కస్టడీలోకి తీసుకోనున్నారు సీపీఎస్ పోలీసులు. ఇక ఇప్పటికే యూనియన్ బ్యాంక్ మేనేజర్ మస్తాన్ వలీ ని మూడు రోజుల పాటు విచారించారు..ఇదే కేసు లో అరెస్ట్ అయిన ఏపీ మర్కంటైల్ సొసైటీ ఛైర్మన్ సత్య నారాయణ, మేనేజర్ పద్మావతి, క్లర్క్ మొహిద్దిన్ లను శనివారం  కస్టడీ లోకి తీసుకున్నారు.ఈ స్కామ్లో ఏ1 మస్తాన్ వలీ ఏ2 సోమశేఖర్ అలియాస్ రాజ్ కుమార్ ఏ3 సత్యనారాయణ ఏ4 పద్మావతి ఏ5 మోహినుద్ధిన్ ఏ6 వెంకట సాయి ఏ7 నండూరి వెంకట్ ఏ8 వెంకటేశ్వరరావు ఏ9 రమేష్ ఏ10 సాధన ఉన్నారు. ఈ ముఠా గతంలోనూ పలు కుంభకోణాలకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఈ స్కామ్లో యూబీఐ మేనేజర్ మస్తాన్ వలితో కుమ్మకైన నిందితులు తెలుగు అకాడమీ డిపాజిట్లు కాజేసినట్లు సీసీఎస్ పోలీసులు వెల్లడించారు.
ముగ్గురు నిందితులను 4 రోజుల కస్టడీ కి అనుమతించింది నాంపల్లి కోర్టు. దీంతో ఈ రోజు నుంచి 4 రోజుల కస్టడీ లోకి తీసుకోనున్నారు పోలీసులు. మస్తాన్ వలీని 4 వ రోజు కస్టడీలో తీసుకొని ఈ కేసుపై పోలీసులు అతన్ని ప్రశ్నించనున్నారు. అలాగే… మరి కొంత మంది నిందితులను కస్టడీలోకి తీసుకునేందుకు కోర్టును పోలీసులు అనుమతి కోరే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతోంది. తద్వారా ఈ కేసులో నిందితులు కొట్టేసిన డబ్బుపై కూపి లాగనున్నారు పోలీసులు.
ఈ ఏడాది జనవరి నుంచి సెప్టెంబర్ వరకు స్కామ్కు పాల్పడినట్టు గుర్తించారు. డిసెంబర్కల్లా అకాడమీకి చెందిన రూ.324 కోట్లు కొట్టేయాలని స్కేచ్ వేసినట్లు తెలిపారు. కమిషన్ల ఎర చూపి బ్యాంక్ సిబ్బందిని ముగ్గులోకి దింపినట్లు తెలుస్తోంది. ఈ స్కామ్పై కేసులు నమోదు చేసుకుని దర్యాప్తు చేసిన సీసీఎస్ పోలీసులు గత వారమే నలుగురిని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. మస్తాన్ వలీతో పాటు ఏపీ మర్కంటైల్ సొసైటీ చైర్మన్ సత్యనారాయణ మేనేజర్ పద్మావతి క్లర్క్ మొహిద్దీన్లను అరెస్టు చేశారు

Previous articleప్రీపోల్ సర్వేలు నిర్వహించకుండా ఎన్నికల సంఘం తగిన చర్యలు తీసుకోవాలి
Next articleఎన్ని ఒడిదుడుగులు ఎదురైనా ఇచ్చినా హామీలను నెరవేరుస్తాం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్థం చేసింది చంద్రబాబే పుర‌పాల‌క శాఖ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ‌

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here