నంద్యాల
నంద్యాల పట్టణంలో38 వ వార్డు వైయస్సార్ నగర్ లో లో గతంలో మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి వైయస్సార్ నగర్ ప్రజల కోసం 56 సెంట్ల స్థలాన్ని అయ్యప్ప స్వామి దేవాలయంకు మరియు రామాలయం నిర్మించడం కోసం స్థలాన్ని కేటాయించడం జరిగిందన్నారు. అస్తలం లో నేడు శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి దేవాలయాలకు భూమిపూజ నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా నంద్యాల శాసనసభ్యులు శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి మాట్లాడుతూ
ఈరోజు దేవాలయాల నిర్మించడం కోసం వైయస్సార్ నగర్ ప్రజలందరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి భూమి పూజ నిర్వహించడం చాలా సంతోషంగా ఉందన్నారు. అలాగే దేవాలయ పనులన్నీ త్వరగా పూర్తి కావాలని అలాగే అక్కడ డెవలప్మెంట్ చేయడానికి మా వంతు కృషి చేస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.
ఈకార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మాభున్నిసా,మున్సిపల్ వైస్ చైర్మన్ గంగి శెట్టి శ్రీధర్,38 వార్డు కౌన్సిలర్ సావిత్రిమ్మ,
బెస్త డైరెక్టర్ చంద్ర శేఖర్,
కౌన్సిలర్ చంద్ర శేఖర్,వైసీపీ నాయకులు టివి రమణ,సాయిరాం రెడ్డి, పద్మశ్రీ సుబ్బరాయుడు, మరియు . నాయకులు వైయస్ ఆర్ నగర్ ప్రజలు పాల్గొన్నారు.