హైదరాబాద్
జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయన్ని బీజేపీ కార్పొరేటర్లు ముట్టడించారు., దాంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. మంగళవారం ఉదయం మేయర్ ఛాంబర్ కు వెళ్లేందుకు ప్రయత్నించిన బీజేపీ కార్పొరేటర్ల ను పోలీసులు అడ్డుకున్నారు. వెంటనే కార్పోరేషన్ వెంటనే జనరల్ బాడీ మీటింగ్ పెట్టాలని డిమాండ్ చేసారు. ఐదు నెలల క్రితం వర్చువల్ మీటింగ్ పెట్టినా, అప్పటి నుంచి ఒక్క పని కూడా జరగలేదని వారు ఆరోపించారు. సాధారణ మీటింగ్ పెట్టి , ప్రజా సమస్యలను పరిష్కరించాలని వారు డిమాండ్ చేసారు. అందోళన జరుగుతున్న సమయంలో మేయర్ ఛాంబర్ లోని వస్తువులు ద్వంసం అయ్యాయి