Home ఆంధ్రప్రదేశ్ హిందూపురంలో ఉద్రికత్త

హిందూపురంలో ఉద్రికత్త

100
0

అనంతపురం
అనంతపురం పట్టణంలో విద్యార్థులపై లాఠీచార్జి చేసిన సంఘటన నిరసిస్తూ  జిల్లాలోని హిందూపురం పట్టణంలో బిజెపి చేపట్టిన నిరసన లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. అంబేద్కర్ సర్కిల్ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ సీఎం జగన్ మోహన్ రెడ్డి దిష్టిబొమ్మ  తగలబెట్టడానికి  ప్రయత్నించగా పోలీసులు అప్రమత్తమై దిష్టిబొమ్మలు లాక్కెళ్లారు. తాసిల్దార్ కార్యాలయం వరకు బిజెపి నాయకులు ర్యాలీ సమయంలో  ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్ కాన్వాయ్ ప్రభుత్వ ఆసుపత్రికి వెళుతోంది. బిజెపి నాయకులు కాన్వాయ్ ను  అడ్డగించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తామేమీ తక్కువ అంటూ బిజెపికి వ్యతిరేకంగా వైసిపి నాయకులు  నినాదాలు చేశారు.  ఇలా ఒకరికొకరు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అంతటితో ఆగకుండా బిజెపి నాయకులు ప్రధాన రోడ్డుపై బైఠాయించి సీఎం డౌన్ డౌన్ పోలీసుల జూలుం నశించాలని నినాదాలు చేశారు. వన్ టౌన్  సిఐ ఇస్మాయిల్ సంఘటనా స్థలానికి చేరుకొని ఆందోళనకారులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు

Previous articleవాకర్స్ ధర్నా
Next articleధాన్యం కొనుగోలు విషయంలో కిషన్‌ రెడ్డి, బండి పొంతన లేని వాదనలు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here