వరంగల్ నవంబర్ 1
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. మార్కెట్లోని నాగేంద్ర ట్రేడింగ్ కంపెనీ నుంచి తమకు రావాల్సిన బకాయిలు ఇప్పించాలనే డిమాండ్‌తో సోమవారం చాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో ఆడ్తిదారులు నిరసనకు దిగారు.కొనుగోలు జరపలేమంటూ మార్కెట్ ప్రధాన కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు.దీంతో పంట ఉత్పత్తుల కొనుగోలుకు బ్రేక్ పడింది. మధ్యాహ్నం కావస్తున్నా ఇంకా కొనుగోలు మొదలు పెట్టకపోవడాన్ని నిరసిస్తూ రైతులు మార్కెట్ ప్రధాన కార్యాలయాన్ని ముట్టడించారు. ఒకవైపు ఆడ్తిదారులు, మరోవైపు రైతుల ఆందోళనతో మార్కెట్లో ఉద్రిక్తత నెలకొంది. రంగంలోకి దిగిన పోలీసులు పరిస్థితులను అదుపులోకి తీసుకొచ్చారు.