జమ్మూ నవంబర్ 12
జమ్మూకశ్మీర్‌లోని కుల్గామ్ జిల్లా చవల్గామ్ ప్రాంతంలో శుక్రవారం భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఒక గుర్తుతెలియని ఉగ్రవాది హతం అయ్యాడు. చవల్గామ్ ప్రాంతంలో ఉగ్రవాదులు సంచరిస్తున్నారనే సమాచారం మేర జమ్మూకశ్మీర్ పోలీసులు కేంద్ర భద్రతా దళాలతో కలిసి శుక్రవారం గాలింపు చేపట్టారు. ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో జవాన్లు ఎదురుకాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో మరణించిన ఉగ్రవాది వద్ద నుంచి ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నామని పోలీసులు చెప్పారు. అంతకుముందు నవంబర్ 9వతేదీన జమ్మూ కాశ్మీర్‌లోని షోపియాన్ జిల్లాలో భద్రతా దళాలతో జరిగిన రెండు వేర్వేరు ఎన్‌కౌంటర్‌లలో ఐదుగురు ఉగ్రవాదులు హతమయ్యారు.