కరీంనగర్
మహనీయ మహమ్మద్ ప్రవక్త (సల్లం) జన్మదినాన్ని పురస్కరించుకుని మర్కజీ మిలాద్ కమిటీ ఆధ్వర్యంలో బొంబాయి స్కూల్ నుండి నిర్వహించిన పవిత్ర పాదయాత్రను (ర్యాలీ) వేలాదిగా తరలివచ్చి విజయవంతం చేసిన మహమ్మద్ ప్రవక్త అభిమానులకు మీలాద్ కమిటీ బాద్యులు మౌలాన అలీమోద్దీన్ నిజామీ..గులాం రబ్బానీ ఖాద్రి..ఫరీద్ బాబాలు కృతజ్ఞతలు తెలిపారు. శుక్రవారం నగరంలోని హుస్సేనీ పుర బొంబాయి స్కూల్ (మదర్సా గౌసుల్ రీఫయ్య ఖాళీదే గుల్షన్) కార్యాలయంలో ఏర్పాటు చేసిన కృతజ్ఞత సమావేశంలో వారు మాట్లాడారు. 11 రోజులు 11 ప్రాంతాల్లో ఆధ్యాత్మిక సదస్సులు నిర్వహణకు సహకరించిన ఆయా ప్రాంతాల అధ్యక్ష, కార్యదర్శులకు..వివిధ ప్రాంతాల నుండి తమ పిలుపును మన్నించి విచ్చేసిన ఇస్లామీయ ధార్మిక పండితులకు..చివరి రోజున గత మంగళవారం మీలదున్నబి ర్యాలీ పవిత్ర పాదయాత్ర బొంబాయి స్కూల్ నుంచి కరీముల్లాహ్ షాహ్ దర్గాహ్ వద్ద ఎలాంటి ఆటంకాలు లేకుండా శాంతియుతంగా కొనసాగడానికి సహకరించిన పోలీసు శాఖకు.. ప్రింట్.. ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు..ఆదరించి..అక్కున చేర్చుకొని..గుండెల్లో పెట్టుకున్న నగర ముస్లిం సోదరులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. మర్కజీ మీలాద్ కమిటీని విచ్ఛిన్నం చేయాలని కుట్రతోస్వార్థంతో కొందరు సోషల్ మీడియాలో ఏదో జరుగబోతుందని పుకార్లను.. అపోహలను సృష్టించిన ప్పటికీ, ఆశిఖే రసూల్ మహమ్మద్ ప్రవక్తను ప్రేమతో మనస్ఫూర్తిగా అంగీకరించి అభిమానించే ముస్లింల దృష్టి మరల్చే కుట్రలు చేసిన, వీటిని ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మకుండా, తిరస్కరించి బొంబాయి స్కూల్ కు వేలాదిగా తరలివచ్చి అండగా నిలిచి.. అభిమానాన్ని చాటిన నగర ముస్లిం సమాజానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈకార్యక్రమంలో ఖాధిమానే మిల్లత్ కార్యదర్శి సమద్ నవాబ్..మియా భాయ్..హజీఖాన్..నఖీబ్ రజా.. లయిఖ్ ఖాద్రి..మౌలాన సయ్యద్ శాఖాద్రి..అస్మత్ అలిబేగ్..సాజిద్ తదితరులు పాల్గొన్నారు