Home తెలంగాణ సమాజంలో ఉన్న ప్రతి అమ్మాయి మన సొంత కూతురుగా భావించినప్పుడే ...

సమాజంలో ఉన్న ప్రతి అమ్మాయి మన సొంత కూతురుగా భావించినప్పుడే బాలికల అభ్యున్నతి సాధ్యమవుతుంది ములుగు డిఆర్ఓ రమాదేవి

87
0

ములుగు అక్టోబర్ 11

సమాజంలో ఉన్న ప్రతి అమ్మాయి మన  సొంత  కూతురుగా  భావించినప్పుడే బాలికల అభ్యున్నతి సాధ్యమవుతుందని.తల్లి తండ్రుల మొదటి గురువుగా పిల్లల పట్ల బాధ్యత తీసుకోవాలని ములుగు డి ఆర్ ఓ  రమాదేవి  అన్నారు
జిల్లా కలెక్టర్ కాన్ఫరెన్స్ హాలు లో  సోమవారం రోజున అంతర్జాతీయ బాలికా దినోత్సవాన్ని జిల్లా కలెక్టర్ ఎస్.కృష్ణ ఆదిత్య  ఆదేశాల మేరకు  మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ  మరియుగ్రామీణ అభివృద్ధి సంస్థ  ములుగు  అధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించగా ఈ కార్యక్రమానికి . ముఖ్య అతిథిగా  హాజరైన ములుగు డిఆర్ ఓ రమాదేవి మాట్లాడుతూ
మహిళలు మహా రాణులు గా గుర్తింపు పొందాలి అంటే  బాల్యం నుండి తల్లిదండ్రులు పిల్లల పెంపకం చాలా ముఖ్యమని  ఒక్క కుటుంబం అభ్యున్నతికి మహిళలే  కారణం అని,  జిల్లా అభివృద్ధికి స్త్రీ శిశు సంక్షేమ శాఖ చేస్తున్న కృషి చాలా విశాలమైంది అని రమాదేవి అన్నారు. బిడ్డ పుట్టకముందు నుండి ,పుట్టిన తర్వాత వరకు వారి ఎదుగుదలకు తోడ్పడుతుందని అంగన్ వాడి కార్యకర్తలు ప్రతి బిడ్డకు  వారు మొదటి తల్లిగా గుర్తింపు గుర్తింపు బడతారని, వృత్తి రీత్యా ఎంతో నిబద్ధత గా ఉండాలని అన్నారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన అభివృద్ధి పథకాల గురించి ఎప్పటికప్పుడు ప్రజలకి తెలియజేస్తూ ఉండాలని డి ఆర్ ఓ ఈ సందర్భంగా గుర్తు చేశారు
జిల్లాస్థాయి అవగాహన కార్యక్రమం జిల్లా సంక్షేమ అధికారి పీ ప్రేమ లత   అధ్వర్యంలో నిర్వహించు కోవడం  జరిగిందని
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
అమ్మాయిల భద్రత సమాజానికి ప్రతిషటాత్మకంగా మారిందని, మన చుట్టూ ఉన్న బంధువుల నుంచి తెలిసిన వాళ్ల నుంచే   అమ్మాయిల యొక్క మనుగడకు సమస్యగా మారిందని  ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పనిచేయుచున్న వివిధ  విభాగాలైన  ఐ సి డి ఎస్, జిల్లా బాలల పరిరక్షణ విభాగం,   చైల్డ్ లైన్1098,  అదేవిధంగా సఖి వన్ స్టాప్ సెంటర్  లు క్షేత్రస్థాయిలో సేవలందిస్తూ  పనిచేస్తున్నాయని వారు అన్నారు. సంబంధిత విభాగాల  అధికారులు మరియు సిబ్బంది ఇతర ప్రభుత్వ శాఖల  తో సమన్వయ తో  పని చేయాలని తెలిపారు . తద్వారా ములుగు జిల్లాని  ఆదర్శవంతమైన బాల్య స్నేహపూర్వక జిల్లాగా రూపొందించడంలో ఎవరి   పాత్ర వారు పోషించాలని  తెలిపారు.

జిల్లా గ్రామణాభివృద్ధి అధికారి, శ్రీమతి నాగపద్మజ  మాట్లాడుతూ  గ్రామస్థాయిలో అంగన్ వాడి టీచర్లు, ఐకెపి సిబ్బంది, స్వయం సహాయక సిబ్బంది వారివారి పరిధిలో నివసిస్తున్నా బాలికలను గుర్తించి తల్లిదండ్రులకి  ఎప్పటికప్పుడు.బాలికల చదువు, ఆరోగ్య,లింగ  సమానత్వము, అన్నిటికిమించ, అమ్మయిల ఆత్మా రక్షణ కొరకు తీసుకోవాల్సిన చర్యలు మరియు  భద్రత తదిర విషయాలపై కౌన్సిలింగ్ నిర్వహించాలని బాధ్యతగా వారిని చదువుతో పాటు వివిధ నైపుణ్య శిక్షణ వైపు మళ్లించాలని  అట్లాగే  అమ్మాయిల  జీవితంలో ప్రతి విద్యతో పాటు ఇతర  జీవన నైపుణ్యాల్లో పట్టు సాధిస్తే గాని అభివృద్ధి చెందిన దేశాలవలె మానసమాజం అభివృద్ధి చెందుతుందని అన్నారు.

జిల్లా పౌరసంబంధాల అధికారి, ప్రేమలత  మాట్లాడుతూ అమ్మయిగా పుట్టడమే అదృష్టం అని అందుబాటులో ఉండే అవకాశాలను అందిపుచ్చుకుని ఆత్మవిశ్వసం తో అమ్మాయిలు  ముందుకెళ్లాలని అన్నారు.

బాలరక్ష భావన కోఆర్డినేటర్  కే.స్వాతి  మాట్లాడుతూ  బాల్యవివాహాలు బాలిక రక్షణ మరియు విద్య అవసరాలను గూర్చిన  అవగాహన కలిగినప్పుడు ఈ జిల్లాలో తక్కువ సంఖ్యలో బాల్య వివాహాలు గాని డ్రాప్ అవుట్ చిల్డ్రన్స్ గాని ఏర్పడకుండా ఉండడానికిసహాయపడుతుందన్నరు.

జిల్లా బాలల పరిరక్షణ అధికారి జె .ఓంకార్ మాట్లాడుతూ బాలల పై జరుగుతున్న అత్యాచారాలను, బాల్య వివాహాలు అరికట్టాలని బాలల రక్షణ ప్రాథమికంగా కుటుంబం తీసుకోవాలని, అందుకు మనం తల్లిదండ్రులను పిల్లలకు స్నేహితులుగా తయారు చేయాలని తెలిపారు.
ఈ మార్పును మన ఇంటినుండి ఆచరణను చూపించినపుడే ఈ సమాజం లో అమ్మాయిలపై  జరిగే అత్యాచారాలు  అదేవిధంగా  హక్కుల ఉల్లంఘనను తగ్గించవచ్చని ఆమె అన్నారు ..

ఈ కార్యక్రమంలో ఏపీడీ , శ్రీనివాస్ డి పి ఎంగోవింద్ చౌహాన్, సి డి పి ఓ  లు జి.మల్లీశ్వరి, హేమలత, లక్ష్మి. ముత్తమ్మ , సూపర్ వైజార్.  ఏ పి ఎం  రవి, చైల్డ్ లైన్ కో ఆర్డినేటర్ బి. ప్రణయ్, గ్రూపు సభ్యులు, అంగన్ వాడి టీచర్ లు, డి సి పియు, సఖీ చైల్డ్ లైన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Previous articleఆకస్మికంగా మరణించిన పోలీస్ సిబ్బంది కుటుంబానికి అండగా ఉంటాము –జిల్లా ఎస్పీ సిహెచ్.ప్రవీణ్ కుమార్
Next articleముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఘనస్వాగతం పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన సిఎం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here