దేవనకొండ
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు వ్యతిరేక నూతన వ్యవసాయ చట్టాలు తీసుకు రావడంతో అందుకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా రైతన్నలు నల్ల చట్టాలను రద్దు చేయాలని పోరాటాలు కొనసాగించిన ఫలితంగానే కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి నూతన వ్యవసాయ చట్టాలను రద్దు నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించదని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు బి వీర శేఖర్,సీపీఐ మండల కార్యదర్శి నరసరావు అన్నారు.శుక్రవారం దేవనకొండ నందు సీపీఐ, సీపీఎం ఉభయ కమ్యూనిస్టు పార్టీల ఆధ్వర్యంలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించి పత్తికొండ – కర్నూలు ప్రధాన రహదారి అయిన ఆర్టీసీ బస్టాండ్ నందు బాణా సంచ కాల్చి రైతుల,కార్యకర్తల ఆధ్వర్యంలో సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాలక ప్రభుత్వాలు రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తే ప్రభుత్వాల పతనమేనన్నారు నల్ల చట్టాల రద్దుకై పోరాడడంతో రైతన్నకె న్యాయం జరుగుతుందని ఈ పోరాట ఫలితమే ఇందుకు నిదర్శనమన్నారు.
“భారతదేశ వ్యవసాయ రంగాన్ని కాపాడుకోవడానికి ఈ ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకుని ”
రైతుకు అవసరమైన చట్టాలు ప్రభుత్వాలు కల్పించేంతవరకు యావత్తు ప్రజానీకం ,రాజకీయ పార్టీలు,మీడియా, పత్రికరంగం సహకరించాలన్నారు..
ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు కె.మద్దిలేటిశెట్టి, సీపీఐ మండల కార్యదర్శి ఎమ్.నరసరావు,సీపీఐ, సీపీఎం మండల నాయకులు ఎస్.ఎమ్. యూసుఫ్,, అశోక్,వెంకటేశ్వర్లు, నెట్టికల్, రామాంజనేయులు, కృష్ణ, మధు,శివ,నాగరాజు,శ్రీనివాసులు, కేసన్న, తదితరులు పాల్గొన్నారు.