Home తెలంగాణ నల్ల చట్టాల రద్దు రైతుల విజయం వ్యవసాయ ఉత్పత్తులకు మద్దతు ధర కల్పించాలి...

నల్ల చట్టాల రద్దు రైతుల విజయం వ్యవసాయ ఉత్పత్తులకు మద్దతు ధర కల్పించాలి రాష్ట్ర ప్రభుత్వం భేషజాలకు పోకుండా కొనుగోళ్లు ప్రారంభించాలి కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి డిమాండ్

255
0

జగిత్యాల,నవంబర్ 19
మూడు రకాల వ్యవసాయ నల్ల  చట్టాలను వెనక్కి తీసుకుంటున్నట్లు  ప్రధాని మోడీ ప్రకటించడం హర్శనియమని మాజీమంత్రి,కాంగ్రెస్  సీనియర్ నాయకులు, కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి అన్నారు.శుక్రవారం జగిత్యాలలో  ఇందిరాగాంధి జయంతి వేడుకల్లో పాల్గొని  మాట్లాడారు నల్ల చట్టాల రద్దు అంశం
ఇధి ముమ్మాటికీ రైతుల విజయమని ఆయన పేర్కొన్నారు.ఏడాది కాలంగా
రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తున్న ధృష్ట్యా ఆలస్యంగానైనా    కొత్త వ్యవసాయ చట్టాల రద్దు నిర్ణయం ప్రకటించడం పట్ల  ప్రధాని మోడిని అభినందించారు. ఆలస్యంగానైన మోడి వాస్తవాలను గ్రహించారని తెలిపారు.
చట్టాల రద్దుతో పాటు వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు కల్పించాలని జీవన్ రెడ్డి కెంధ్రానికి సూచించారు.నల్ల చట్టాల విషయంలో
అకాలిధళ్ పార్టీ బిజీపి కూటమి నుంచి వైధొలిగి రైతుల పక్షాన నిలిచి పోరాటం చెయడం
అభినందనీయమన్నారు.
టిఆర్ఎస్  ప్రభుత్వం 3 వ్యవసాయ చట్టాల విషయంలో ధొబుచులాడింధని చెభుతూ వీటికి  వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేయలేదని విమర్శించారు.రాష్ట్రం ప్రభుత్వం రైతుల విషయంలో భేషజాలకు పోకుండా,రైతులు పండించిన  వరి ధాన్యాన్ని మద్దతు ధర చెల్లించి  వెంటనే కొనుగోలు చేయాలని ఆయన డిమాండు చేశారు.ధర్నాలు చెయడం కాదు కల్లాళ వద్దకు వెళ్లి కొనుగోళ్లు ఆరంబించాలన్నారు. వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధర అమలు చేయాలని, అలాగే జిల్లా రెవెన్యూ యంత్రాంగం కొనుగోలు కెంధ్రాలు సందర్శించి రైతులకు భరోసా కల్పించాలన్నారు.
వ్యవసాయ చట్టాలు రైతులకు అవరొధంగా ఉన్నాయని భావించిన    రైతులు సంఘటితంగా ఉండి పోరాటం చేయడంతోనె కెంధ్రం రద్దు చేసిందని ఇధి ఏరాజకీయ పార్టీ విజయం కాదని  కేవలం రైతుల విజయమని జీవన్ రెడ్డి పునర్ధ్గాటించారు.
ఈ సంధర్బంగా జగిత్యాల పట్టణంలో రైతుల పక్షాన నల్ల చట్టాల రద్దు చేసినందుకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు టపాసులు కాల్చారు.
సమావేశంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు అడ్లురి లక్ష్మణ్ కుమార్,  నాయకులు బండ శంకర్,  కొత్త మోహన్,ధుర్గయ్య, నక్క జీవన్,దేవేందర్ రెడ్డి, మన్సుర్ ఆలీ, నెహాల్ మున్నా,రాధాకిషన్ అశోక్ తదితరులున్నారు.

దేశాన్ని అగ్రభాగాన నిలిపిన ఘనత ఇందిరాగాంధీ

ఇందిరా జయంతి సభలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

ప్రపంచంలొకేల్ల భారత దేశాన్ని అగ్రభాగాన నిలిపిన ఘనత స్వర్గీయ ఇందిరాగాంధీకె ధక్కింధని కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి అన్నారు.
శుక్రవారం ఇందిరాగాంధి జయంతి సందర్బంగా జగిత్యాలలో ఆమే చిథ్రపటానికి పులమాల వేసిణ జీవన్ రెడ్డి కాంగ్రెస్ శ్రేణులతో కలిసి పాత బస్టాండ్ చౌరస్తాలొని ఇందిరాగాంధి విగ్రహానికి పులమాల వేశారు.
ఈ  సంధర్బంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ అధికారాన్ని ప్రజాసెవకు ఉపయొగపడెవిధంగా పనిచేసి ప్రజా జీవితానికే ఇందిరాగాంధి ఆదర్శంగా నిలిచారని కొనియాడారు.
చిన్న వయస్సులొనే స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొని జైలుకెల్లిన ఉక్కు మహిళా అన్నారు.
బడుగు,బలహీన వర్గాల సంక్షేమం కొసం పటుపడ్డారని,ప్రభుత్వ రంగసంస్థలను బలోపేతం చేసి నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించారని తెలిపారు.
ఆహారభధ్రథ చట్టం, ప్రజల ఆత్మ గౌరవాన్ని నిలబెట్టడానికి ఆస్తి హక్కు చట్టం, నిరుపేదలకు భూ పంపిణీ చెయడానికి భుసంస్కరణల చట్టం థిసికొచ్చింధన్నారు.
దేశంలో అన్ని మతాల వారికి సమాన హకుల కల్పనలో దోహదపడ్డరనీ వివరించారు.
దేశంలో ఏ ఒక్కరూ ఇల్లు లేకుండా ఉండకూడదని ఊరూరా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపట్టి అందరికి ఆదర్శంగా నిలిచరన్నారు.
దేశ సమగ్రతను కాపాడడం లోనూ ప్రధాని భద్రత విషయంలోను అనుమానాలకు తావులేకుండా సమగ్ర భారత దేశం కోసం ప్రాణత్యాగం చేసిన వీర వనిత ఇందిరమ్మ అని చెప్పారూ.
త్యాగధనుల పార్టీ అయిన కాంగ్రెస్ లో కొనసాగడం కాంగ్రెస్ కార్యకర్తల అదృష్టంగా భవిస్థున్నామని జీవన్ రెడ్డి పేర్కొన్నారు.
ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్, కొత్త మొహాన్,బండ శంకర్ ,దేవేందర్ రెడ్డి,దుర్గయ్య,నక్క జీవన్,మున్నా,
మన్సుర్,జగన్,అశోక్,కమటాల శ్రీనివాస్, పులి రామ్,బింగి రవి,అల్లాల రమేశ్ రావు, బాపురెడ్డి, విజయ్, నేహాల్,చాంద్ ,గుండ మధు ,కమల్ ,శేఖర్, కమల్,విజయ్,రియాస్ ,తదితరులు పాల్గొన్నారు.

Previous articleక్యారెక్టర్ అసానినేషన్ చేస్తున్నారు
Next articleపూజారి కూతురు వివాహానికి కళానిలయం సహాయం – రూ.20 వేల నగదు, బియ్యం అందజేత

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here