ఆదిలాబాద్
రాష్ట్ర మహిళ శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి దివ్య దేవరాజన్, అదిలాబాద్ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదివాసీ మహిళలతో కలిసి గుస్సాడీ నృత్యాలు చేసారు. భారతదేశ చరిత్రలోనే ఆదివాసీలకు గొప్పగా సంస్కృతి సంప్రదాయాలు ఉన్నాయని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి దివ్య దేవా రాజన్ అన్నారు…ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలంలోని జామా గ్రామంలో జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ కలిసిపర్యటించారు..ఆదివాసీలు తమ సంప్రదాయాల ను కాపాడుకోవాలని సూచించారు…. దండారి కార్యక్రమంలో పాల్గొని ఆదివాసీ మహిళల తో కలిసి గుస్సాడీ నృత్యం చేశారు… ఈ ప్రాంత ఆదివాసీ చిన్నారులకు, గర్భిణులకు రక్తహీనత ఉందని వారి కోసం ఐటీడీఏ-ఐసీడీఎస్ కలిసి గిరిపోషణ్ పథకం ప్రవేశ పెట్టి ఇప్ప పువ్వు లడ్డూలను తయారు చేస్తోందని తెలి పారు. గుస్సాడీలకు రాష్ట్ర ప్రభుత్వం కోటి రూపాయలను దండారీ పండుగకు మంజూరు చేసిందన్నారు.