Home తెలంగాణ ముందస్తు ఎన్నికలు లేవన్నదంటే పక్కా ముందస్తు ప్రణాళిక ఉన్నట్లే… బిజెపి...

ముందస్తు ఎన్నికలు లేవన్నదంటే పక్కా ముందస్తు ప్రణాళిక ఉన్నట్లే… బిజెపి నేత విజయశాంతి

75
0

హైదరాబాద్
రాజకీయాల్లో కొందరిపై కొందరు చేసే విమర్శలు.. ఆరోపణలు.. ఘాటుగా ఉండటమే కాదు.. సంచలనంగా మారుతుంటాయి. కొన్ని కాంబినేషన్లు భలే ఆసక్తికరంగా ఉంటాయి. తాజాగా కేసీఆర్ వ్యాఖ్యపై బిజెపి నేత రాములమ్మ స్పందిస్తూ సోషల్ మీడియాలో ఒక పోస్టు పెట్టారు. ‘‘కేసీఆర్ గారు అబద్ధం తప్ప నిజం చెప్పనని ఒట్టు పెట్టుకున్న మనిషి. సందర్భం లేకుండా ముందస్తు ఎన్నికలు లేవని చెప్పిన్రంటే పక్కా ముందస్తు ప్రణాళిక ఉన్నట్లే…. ప్రతిపక్షాలు సిద్ధమవడం మంచిది’’ అన్న ఆమె వ్యాఖ్య ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.   చంద్రబాబు.. లోకేశ్ మీద ఆర్కే రోజా చేసే ఘాటు వ్యాఖ్యలు మరెవరూ చేయలేరనే చెప్పాలి. అదే సమయంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మీద రేవంత్.. విజయశాంతి లాంటివాళ్లు చేసే వ్యాఖ్యలు ఘాటుగానే కాదు.. అందరిని ఆకర్షించేలా ఉంటాయి.తాజాగా ముందస్తు ఎన్నికల గురించి తెలంగాణ సీఎం కీలక వ్యాఖ్యలు చేయటం తెలిసిందే. గతంలో మాదిరి.. ఈసారి తాను ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని భావించటం లేదని స్పష్టం చేయటం తెలిసిందే. దీనిపై తాజాగా రాములమ్మ అలియాస్ విజయశాంతి స్పందించారు. కేసీఆర్ అబద్ధం మాత్రమే చెప్పాలని ఒట్టు పెట్టుకున్నట్లుగా కనిపిస్తోందని బీజేపీ మహిళా నేత పేర్కొన్నారు.ఎందుకిలా? అన్న ప్రశ్నకు విజయశాంతి తనదైన శైలిలో బదులిచ్చారు. సందర్భం లేకుండా.. ముందస్తు ఎన్నికల గురించి కేసీఆర్ ప్రస్తావించారంటే.. పక్కా ముందస్తు ప్రణాళిక ఉన్నట్లేనన్న మాట వినిపిస్తోంది. కేసీఆర్ తాజా వ్యాఖ్యలతో ముందస్తు మీద చర్చ మొదలైందని చెప్పాలి. గత ఎన్నికల్లో ముందస్తు ఎన్నికలకు వెళ్లటం ద్వారా అనూహ్యమైన విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ముందస్తు గురించి లేదని కేసీఆర్ చెప్పారంటే.. విపక్షాలు ముందస్తు గురించి ఆలోచించి.. అందుకు తగ్గట్లు ప్రిపేర్ కావటం మంచిదన్నఅభిప్రాయాన్ని ఆమె వ్యక్తం చేశారు.
తాజాగా కేసీఆర్ వ్యాఖ్యపై స్పందిస్తూ రాములమ్మ సోషల్ మీడియాలో ఒక పోస్టు పెట్టారు. ‘‘కేసీఆర్ గారు అబద్ధం తప్ప నిజం చెప్పనని ఒట్టు పెట్టుకున్న మనిషి. సందర్భం లేకుండా ముందస్తు ఎన్నికలు లేవని చెప్పిన్రంటే పక్కా ముందస్తు ప్రణాళిక ఉన్నట్లే…. ప్రతిపక్షాలు సిద్ధమవడం మంచిది’’ అన్న ఆమె వ్యాఖ్య ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. విజయశాంతి స్పందనకు ముందు టీఆర్ఎస్ ఎల్పీ సమావేశంలో మాట్లాడిన సందర్భంలో కేసీఆర్ నోటి నుంచి ముందస్తు మీద వ్యాఖ్యలు చేశారు. చేయాల్సిన పనులు చాలా ఉన్నాయని.. రెండేళ్ల సమయంలో ఎక్కువ స్థానాలు గెలిచేలా పని చేయాలని పార్టీ నేతల్ని కోరారు. మరి.. కేసీఆర్ మాటల మీద రాములమ్మ అంచనా ఎంతమేర నిజం అవుతుందన్న విషయాన్ని కాలమే బదులివ్వాలి. అప్పుడే క్లారిటీ వచ్చే వీలుంది.

Previous articleమెగాస్టార్ చిరంజీవి కుడి చేతికి సర్జరీ!
Next articleఎంపీ ఆదాల ను కలిసిన జడ్పీ చైర్ పర్సన్ ఆనం అరుణమ్మ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here