నెల్లూరు జిల్లా,
నాయుడు పేట పోలీస్ స్టేషన్ లో గూడూరు డి.ఎస్.పి ఎం. రాజగోపాల్ రెడ్డి తెలిపిన వివరాల మేరకు ఈ నెల 6వ తేదీ నాయుడుపేట లోని రంగా ఎన్ క్లేవ్ అపార్ట్ మెంట్ లో నివాసముంటున్న ఏ. శేషారెడ్డి తన ఇంటి బెడ్ రూమ్ లాకర్ లో ఉంచిన 36 సవర్ల బంగారు,లక్ష రూపాయల నగదుపోయాయి అనీ నాయుడుపేట పోలీసు స్టేషన్ లో ఇచ్చిన ఫిర్యాదు చేశారు . ఈమేరకు రంగంలోకి దిగిన పోలీసులు,నెల్లూరు జిల్లా ఎస్పీ సిహెచ్. విజయరావు ఆదేశాల మేరకు గూడూరు డిఎస్పి ఎం .రాజగోపాల్ రెడ్డి సూచనలతో నాయుడుపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ సోమయ్య ఆధ్వర్యంలో ఎస్ఐ కృష్ణారెడ్డి ఈ కేసును ఛాలెంజ్ గా తీసుకుని లోతుగా దర్యాప్తు చేయగా అల్లుడే దొంగ అని తెలిసింది.
దొంగతనం జరిగిన తీరు.శేషారెడ్డి అతని భార్య నాయుడుపేట లోని పుదూరు లో వున్న తన టపాసుల అంగడికి ఉదయం 8.30 కి వెళ్ళి తిరిగి సాయంత్రం 7గం లకు తమ ఇంటికి చేరుకునే వారని ,ఇది గమనించిన శేషారెడ్డి భార్య అన్న కొడుకు దినేష్ మారు తాళాలు ఉపయోగించి ,లాకర్ లో ఉన్న 36 సవర్ల బంగారు నగలు,లక్ష రూపాయల డబ్బులు దొంగిలించాడని పోలీసుల దర్యాప్తులో తేలింది. ఇతని వద్ద నుండి నగలు,డబ్బు రికవరీ చేశామని గూడూరు రాజగోపాల్ రెడ్డి మీడియాకు వివరించారు.
ఈ కేసు చేదనలో పనిచేసిన సర్కిల్ ఇన్స్పెక్టర్ సోమయ్య, సబ్ ఇన్స్పెక్టర్ కృష్ణా రెడ్డి పోలీసు సిబ్బంది మోహన్ రాజు,కరీం,దయాకర్,పోలయ్య,వెంకటే