Home తెలంగాణ గిరిజన చిన్నారిపై అత్యాచారం చేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలి బహుజన సమాజ్ పార్టీ...

గిరిజన చిన్నారిపై అత్యాచారం చేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలి బహుజన సమాజ్ పార్టీ నాయకులు బీఎస్పీ ఆధ్వర్యంలో మోటర్ సైకిల్ ర్యాలీ, ఆర్డివో కు వినతి పత్రం

145
0

కోరుట్ల నవంబర్ 05
సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం అల్మాస్ పూర్ గ్రామంలోని తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ నాయకులు సర్పంచ్ భర్త రాధ రఘు శంకర్ గిరిజన చిన్నారిని అత్యాచారం చేసినందున ప్రభుత్వం వెంటనే ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి నిందితున్ని ఉరి తీసేటట్లు చర్యలు తీసుకోవాలని కోరుతూ బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో మెట్ పెల్లి పట్టణంలో నాయకులు మోటర్ సైకిల్ ర్యాలీ గా వెళ్లి స్థానిక ఆర్డీవో కార్యాలయంలో ఆర్డీవో టి. వినోద్ కుమార్ కి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా బహుజన సమాజ్ పార్టీ జిల్లా ఇంచార్జి న్యాయవాది పుప్పల లింబాద్రి మాట్లాడుతూ అగ్రవర్ణ కులాలకు చెందిన అమ్మాయిలు అత్యాచారాలకు గురి అయితే ప ప్రభుత్వం ఎన్కౌంటర్లు చేస్తుందని ,అదేవిధంగా బడుగు, బలహీన, ఎస్సీ ,ఎస్టీ, మైనార్టీ వర్గాలకు చెందిన అమ్మాయిలు అత్యాచారాలకు గురైతే నిర్లక్ష్యం చేస్తుందని  పుప్పల లింబాద్రి ఆవేదన వ్యక్తం చేశారు .అత్యాచారానికి గురైన బాధితురాలికి ప్రభుత్వం కోటి రూపాలు పరిహారం చెల్లించాలని ,బాధిత కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని ఆయన ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. ఈ ర్యాలీలో బహుజన్ సమాజ్ పార్టీ నాయకులు బివిఎఫ్ కన్వీనర్ అజయ్,  సురాజ్ ,అజయ్,నరేష్ ,ప్రకాష్, రాములు, లక్ష్మణ్, ప్రభాకర్, సురేందర్ ,శంకర్, ప్రశాంత్, రమేష్, సద్దాం, ముజ్జు ల,తోపాటు వంద కార్యకర్తలు పాల్గొన్నారు.

Previous articleకళ్యాణ్ దేవ్, పులి వాసు, రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్ ‘సూపర్ మచ్చి’ టీజర్ విడుదల
Next articleజవాన్ల పై తోటి జవాన్ కాల్పులు..ముగ్గురు మృతి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here