బేతంచెర్ల,
రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అరాచక పనులకు వై. సి. పి ప్రభుత్వానికి బేతంచెర్ల నుండి బుద్ధి చెప్పాలని టిడిపి నాయకులు ధర్మవరం సుబ్బారెడ్డి, సోమిశెట్టి వెంకటేశ్వర్లు అన్నారు. బేతంచర్ల నగర పంచాయతీలో జరుగుతున్న ఎన్నికల ప్రచారంలో భాగంగా కొత్త బస్టాండ్ నుండి పాత బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించి పాత బస్టాండ్ లో టి. డి. పి నాయకులు మాట్లాడుతూ వై. య. స్సార్సీ. పి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి అందరి పై అక్రమ కేసులు బనాయిస్తూ అరాచక పాలన సాగిస్తుందని అంతేకాకుండా డీజిల్, పెట్రోల్ ధరలు పెంచి నిత్యావసర సరుకులను కూడా పెంచి సామాన్యుని నెత్తిన భారం మోపుతోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని ఉద్దేశంతోనే జిల్లా నుండి మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు ఈ ప్రచార కార్యక్రమానికి వచ్చామని ప్రభుత్వం పై చాలా వ్యతిరేకత వచ్చిందని బేతంచర్ల లో చాలా సమస్యలు ఉన్నాయని తాము బేతంచెర్ల నగర పంచాయతీ ని చైర్మన్ పదవి చేపట్చిన వెంటనే ఈ సమస్యలకు పరిష్కారం మార్గం చూపుతామని ఇంటి పనులు కూడా పెంచకుండా ప్రజలపై భారం మోపకుండా చూస్తామని వారి సందర్భంగా తెలిపారు. టిడిపికి అత్యధిక మెజార్టీ ని తీసుకు రావాలని వారు ఓటర్లను కోరారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు మాజీ మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డి, మాజీ జెడ్పీ చైర్మన్ మల్లెల రాజశేఖర్, మాజీ శాసన మండలి చైర్మన్ ఎన్. ఎం. డి. ఫరూక్, తెలుగుదేశం పార్టీ డోన్ ఇంచార్జ్ ధర్మవరం సుబ్బారెడ్డి, ముస్లిం మైనార్టీ నాయకుడు జావేద్, మీనాక్షి నాయుడు, భూమా జగద్విఖ్యాత రెడ్డి, తిక్కా రెడ్డి, కే. ఈ శ్యాంబాబు, కే. యి ప్రతాప్, సోమిశెట్టి వెంకటేశ్వర్లు, గౌరు వెంకటరెడ్డి, టిడిపి కార్యకర్తలు పాల్గొన్నారు.