Home తెలంగాణ బొగ్గు గనుల వేలాన్ని రద్దు చేయాలి – సీఐటీయూ ఆధ్వర్యంలో నిరసన

బొగ్గు గనుల వేలాన్ని రద్దు చేయాలి – సీఐటీయూ ఆధ్వర్యంలో నిరసన

92
0

పెద్దపల్లి  అక్టోబర్ 21

కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం, బొగ్గు గనుల వేలాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ అర్జీ1 లోని జీఢీకే 1, 2, 2ఏ, 11, ఇంక్లైన్,సీఎస్పీ1, ఏరియా వర్క్ షాప్ లలో సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో గురువారం కార్మికులు నల్ల బ్యాడ్జీలు ధరించి ప్లే కార్డ్స్ ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు. నిరసన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం దేశంలో సంపద సృష్టిస్తున్న ప్రభుత్వరంగ సంస్థల అన్నిటిని కూడా, కారుచౌకగా గుత్త పెట్టుబడిదారులకు అమ్మే స్తుందని, అందులో భాగంగానే దేశంలోని 88 బొగ్గు బ్లాకులను, అందులో సింగరేణికి సంబంధించిన 4 బొగ్గు బ్లాకులను వేలం వేస్తుందన్నారు. కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో బొగ్గు గనులు ప్రైవేటుపరం అయితే ప్రజలు అంధకారంలో బ్రతకాలి వస్తుందన్నారు. సింగరేణి కార్మికుల సొమ్ముతో కులుకుతున్న రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి వత్తాసు పలకకుండా, ప్రభుత్వ రంగ సంస్థ అయిన సింగరేణి సంస్థను కాపాడుకోవడానికి, పోరాటాలకు ముందుకు రావాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. సింగరేణి సంస్థకు బకాయిపడ్డ 12 వేల కోట్ల రూపాయలు తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్మిక వ్యతిరేకమైన చట్టాలు రద్దు చేయాలని, ప్రభుత్వ రంగ సంస్థలు బొగ్గు పరిశ్రమ ప్రైవేటీకరణ నిలిపివేయాలని, కేంద్రంలోని బిజెపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణ కోసం ఉదృత పోరాటాలకు సిద్ధం కావాలని కార్మికులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అర్జీ1, అధ్యక్ష కార్యదర్శులు, మేదరీ సారయ్య, మెండె శ్రీనివాస్, ఉపాధ్యక్షులు, అసరి మహేష్, సిహెచ్ వేణుగోపాల రెడ్డి, జె.గజేంద్ర, కారం సత్తయ్య, వంగల రాములు, బూర్గుల రాములు, శివరాం రెడ్డి, దుర్గాప్రసాద్, సిహెచ్ లక్ష్మణ్, భీమానాయక్, రవీందర్ రెడ్డి, శంకరయ్య, నంది నారాయణ, బి.రవి, అన్నం శ్రీనివాస్, బుగ్గారం శ్రీనివాసరావు, ఇప్పలపల్లి సతీష్, దేవేంద్ర, జీ.రమేష్, మల్లేష్, కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Previous articleలీస్ అమరవీరులను స్ఫూర్తిగా తీసుకోవాలి – పోలిసుల త్యాగం అజరామరం – పెద్దపల్లి డిసిపి పి.రవీందర్ – పోలీస్ అమరుల త్యాగాన్ని స్మరిస్తూ నివాళులు, కుటుంబ సభ్యులకు పరామర్శ
Next articleవివిధ శాఖల సమన్వయంతో కోవిడ్ వ్యాక్సినేషన్ లక్ష్యం సకాలంలో పూర్తిచేయాలి * జిల్లా కలెక్టర్ జి. రవి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here