అనంతపురం
అనంతపురం ఎస్ఎస్బీఎన్ కళాశాల వద్ద పోలీసులు లాఠీ చార్జి చేయలేదు. విద్యార్థులను కళాశాలలోకి వెళ్లకుండా ఆటంక పరుస్తున్న విద్యార్థి సంఘాల నాయకులను అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేసారని అనంతపురం పోలీసులు వెల్లడించారు. ఈ క్రమంలో పోలీసులపై విద్యార్దులు రాళ్లు రువ్వారు. దీంతో గాయపడిన ఓ విద్యార్థినిని పోలీసులు ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు. స్వల్ప గాయాలైన సదరు విద్యార్థికి ప్రమాదమేమి లేదని డాక్టర్లు వెల్లడించారు. జిల్లా సర్వజన ఆసుపత్రి ముందు రహదారిపై వాహనాల రాకపోకల అంతరాయనికి యత్నించిన విద్యార్థులను చెదరగొట్టామని పోలీసులు తెలిపారు.