దర్శి
ప్రకాశం జిల్లా దర్శి మండలం పోతకమూరు గ్రామ సచివాలయం లో శనివారం జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమం లో ముఖ్య అతిధులు గా దర్శి ఎంపీడీఓ శోభనబాబు మరియు దర్శి మండలం వైస్ ఎంపీపీ సోము దుర్గారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్బంగా దుర్గారెడ్డి మాట్లాడుతూ స్వచ్ఛ సంకల్పం లో భాగంగా పోతకమూరు గ్రామాన్ని వంద రోజుల్లో ఆదర్శ గ్రామంగా తీర్చి దిద్దాలని పలు సూచనలు చేశారు. తదుపరి గ్రామ సర్పంచ్ బొట్ల వెంకయ్య దుర్గారెడ్డి కి శాలువా కప్పి పూలమాలలు తో ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్రమం లో ఎంపీడీఓ శోభన్ బాబు, వైస్ ఎంపీపీ దుర్గారెడ్డి, గ్రామ సర్పంచ్ బొట్ల వెంకయ్య, సచివాలయం సిబ్బంది మరియు గ్రామస్తులు పాల్గొన్నారు