కామారెడ్డి నవంబర్ 03
కామారెడ్డి జిల్లా పిట్లం: వచ్చే ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో బిజెపి పార్టీ గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని జుక్కల్ మాజీ ఎమ్మెల్యే బిజెపి పార్టీ జిల్లా అధ్యక్షురాలు అరుణతార అన్నారు. హుజురాబాద్ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ ప్రజలను అనేక ప్రలోభాలకు గురిచేసి, దాదాపు 1000 కోట్ల రూపాయలు ఖర్చుపెట్టిన కూడా కెసిఆర్ అహంకారానికి అక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ప్రజలు తగిన బుద్ధి చెప్పారని అన్నారు.
అహంకారానికి ఈ ఫలితం నిదర్శనమని దీనితో కెసిఆర్ పతనం ప్రారంభమైందని, అధర్మానికి ధర్మానికి జరిగిన యుద్ధంలో ధర్మం వైపు నిలబడి ఈటెల రాజేందర్ ని ప్రజలు వారి మెజార్టీతో గెలిపించారని, హుజురాబాద్ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పిట్లం పట్టణ బిజెపి అధ్యక్షుడు వడ్ల శివ కుమార్, ఓబీసీ జిల్లా ఉపాధ్యక్షులు అశోక్ రాజ్, అభి రెడ్డి నరసింహ రాజు తదితరులు పాల్గొన్నారు.