హైదరాబాద్ సెప్టెంబర్ 27
మణికొండ నాలాలో గల్లంతైన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మృతదేహం లభ్యమైంది. గోల్డెన్ టెంపుల్‌కు సమీపంలో ఉన్న నెక్నంపూర్ చెరువులో మృతదేహం లభ్యమైంది. శనివారం రాత్రి వర్షం కారణంగా మణికొండ గోల్డెన్ టెంపుల్ వద్ద గోపిశెట్టి రజనీకాంత్ అనే సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మ్యాన్‌హోల్ లో పడిపోయిన విషయం తెలిసిందే. కాగా.. గల్లంతైన వ్యక్తి షాద్‌నగర్‌లోని నోవా గ్రీన్ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. శనివారం రాత్రి 9 గంటలకు ఇంటి నుంచి బయటకు వచ్చిన ఆయన.. నిర్మాణంలో ఉన్న డ్రైనేజీ గుంతలో పడి గల్లంతయ్యాడు. యువకుడి కోసం ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది నగరంలోని మణికొండ నుంచి నెక్నంపూర్ చెరువు వరకు కోసం గాలింపు చర్యలు చేపట్టింది. ఘటన జరిగిన రెండు రోజుల తర్వాత మృతదేహాన్ని గుర్తించారు. మృతదేహం లభ్యమైన ప్రదేశానికి అధికారులు చేరుకున్నారు.