కామారెడ్డి అక్టోబర్ 01
కామారెడ్డి పట్టణంలోని అడ్లూరు గ్రామ శివారులోని జాతీయ రహదారి పక్కన బాలామణి అనే మహిళ మృతదేహం లభ్యం అయింది. కామారెడ్డి రూరల్ సీఐ చంద్రశేఖర్ రెడ్డి కథనం ప్రకారం ఘటనకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి.అడ్లూరు శివారులోని జాతీయ రహదారి పక్కన ఓ గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యం అయిందని తెలిపారు. సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించగా కామారెడ్డి పట్టణంలోని ఆర్ బి నగర్ కు చెందిన కాకర్ల బాలమణి గా గుర్తించినట్లు పేర్కొన్నారు. బాలమణి గత నెల 28వ తేదీన ఇంట్లో నుంచి కార్ఖానా కు వెళ్లి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పట్టణ పోలీసులు అదృశ్యం కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఎవరో పరిచయం ఉన్న వాళ్ళతో అడ్లూరు శివారులో కి బాలమని వెళ్లిందని తెలిపారు. అనంతరం బాలమణిని హత్య చేసినట్లు అనుమానం వ్యక్తం చేశారు. అలాగే బాలమణి వద్ద ఉన్న నగలను ఎత్తుకెళ్ళి ఆమెను హత్య చేసినట్లు తెలిపారు. సంఘటన స్థలం వద్దనే బాలమణి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు పెర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. అలాగే బాలమణి ని హత్యచేసిన నిందితులను పట్టుకుంటామని తెలిపారు.