Home తెలంగాణ గీతారాణి మృతదేహం లభ్యం

గీతారాణి మృతదేహం లభ్యం

90
0

భువనగిరి
లాలాగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని లాలాపేట్ లో అదృశ్యమైన యువతి యాదగిరిగుట్ట రాయగిరి చెరువులో పడి ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో లాలాపేట్ హౌజింగ్ బోర్డు కాలనీలో విషాదచాయలు అలుముకున్నాయి. లాలాగూడ ఇన్స్పెక్టర్ కందుల రవికుమార్ కథనం ప్రకారం. లాలాపేట్ హౌజింగ్ బోర్డు కాలనీకి చెందిన బసవరాజు కుమార్తె కెంచినోరు గీతారాణి (34) ఆర్నాల్డ్ కన్సల్టెన్సీలో హెచ్ఆర్ రిక్రూటర్ గా పని చేస్తుంది. ఇదిలా ఉండగా బుధవారం మధ్నాహ్నం ఒంటిగంటన్నర సమయంలో బ్యాంకు కు వెళ్లి వస్తానని చెప్పి వారి ఇంట్లో చెప్పి తిరిగి రాలేదు. రాత్రైనా గీతారాణి ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు వారికి తెలిసిన వారి బంధువులు, ఆమె స్నేహితులను ఆచూకి కోసం అడిగి తెలుసుకున్నారు. ఫలితం లేకపోవడంతో అదే రోజు అర్థరాత్రి సమయంలో వారు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు మిస్సింగ్ కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా గురువారం సాయంత్రం యాదాద్రి జిల్లా యాదగిరిగుట్ట సమీపంలోని రాయగిరి చెరువులో ఆమె దూకి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులకు సమాచారం అందింది. ఆమె చెరువులో దూకే ముందు ఆమె చెరువు గట్టు మీద సెల్ఫోన్, పర్సు, ఫోటో పడేయడంతో దాని ద్వార ఆమె గీతారాణిగా గుర్తించి వారి కుటుంబ సభ్యులకు స్థానిక పోలీసులు సమాచారం అందించారు. వరంగల్ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తితో ఆమె ప్రేమ వ్యవహారం పెళ్లి వరకు వెళ్లింది. అయితే ఆమెను ప్రేమించిన వ్యక్తి నిరాకరిండంతోనే వారి ఇద్దరి మధ్య జరిగిన సంఘటనలో కలత చెందిన ఆమె చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిసింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Previous articleహంద్రీనీవాకు విద్యుత్ కష్టాలు.. హంద్రీనీవా ప్రాజెక్టు విద్యుత్ బకాయి రూ,317కోట్లు.. ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం బకాయి రూ,57 కోట్లు.. ప్రాజెక్టులకు విద్యుత్ ను నిలిపివేస్తామంటున్న అధికారులు.. రెండు రోజుల గడువు కోరిన నీటిపారుదల శాఖ..
Next articleపవన్ కళ్యాణ్ ను కలిసిన సినీ ప్రముఖులు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here