Home ఆంధ్రప్రదేశ్ ఎనిమిదేళ్ల బాలుడి దారుణ హత్య

ఎనిమిదేళ్ల బాలుడి దారుణ హత్య

327
0

చిత్తూరు
చిత్తూరు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. 8 ఏళ్ల బాలుడు తేజసాయిరెడ్డి దారుణ హత్యకు గురయ్యాడు. అభం శుభం తెలియని చిన్నారిని పొట్టనబెట్టుకున్నారు. కె.వి పల్లి మండలం ఎగువ మేకల వారి పల్లికి చెందిన తేజసాయిరెడ్డి తల్లిదండ్రులు నాగిరెడ్డి, జ్యోతి ఉపాధి కోసం కువైట్ కి వెళ్లారు. అప్పటి నుంచి పీలేరులో ఉన్న పెద్దమ్మ ఇంట్లో ఉంటూ తేజేష్ స్కూలుకు వెళ్తున్నాడు. పండుగ సెలవుల కావడంతో.. అమ్మమ్మ పార్వతమ్మ ఇంటికి వెళ్లాడు. పండంటి పిల్లాడిపై ఎవరి కన్ను పడిందో ఏమో.. మంగళవారం కిడ్నాప్ చేశారు. బంధువులంతా వెతికినా బాలుడి ఆచూకీ లభించలేదు. తెల్లారి చూసేసరికి సమీపంలోని బొప్పాయి తోటలో తేజసాయిరెడ్డి శవమై కనిపించాడు. బాలుడ్ని గొంతు నులిమి చంపినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సమీప బంధువులే తేజసాయిరెడ్డిని హతమార్చి ఉంటారనేది కుటుంబ సభ్యుల ఆరోపణ.

Previous articleప్యాకింగ్‌పై విక్రేతల పేరు ఫిర్యాదుల అధికారి నంబర్‌ను స్పష్టంగా ఉండాలి
Next articleమానవ హక్కుల విలువలను కాపాడుతూ ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉందాలి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here