రంగారెడ్డి
రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పిల్లర్ నెంబర్ 120 పీవీ ఎక్స్ప్రెస్ ఫ్లై ఓవర్ పై శంషాబాద్ నుంచి మైదిపట్నం వెళ్లే దారిలో అర్ధరాత్రి అతి వేగంగా వచ్చిన ఐ20 కారు బోల్తా పడింది. కారులో ఉన్న వ్యక్తికి తీవ్ర గాయాలు కావడంతో ఓ ప్రైవేట్ హాస్పిటల్ కి తరలించారు. సంఘటన స్థలానికి రాజేంద్రనగర్ పోలీసులు చేరుకున్నారు. డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తికి మద్యం మత్తులో ఉన్నాడా అతివేగం అనే కోణంలో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు