Home జాతీయ వార్తలు తెలంగాణను కేంద్రం అవమానిస్తున్నది లోక్‌సభ పక్ష నేత నామా నాగేశ్వర్‌రావు

తెలంగాణను కేంద్రం అవమానిస్తున్నది లోక్‌సభ పక్ష నేత నామా నాగేశ్వర్‌రావు

89
0

న్యూఢిల్లీ నవంబర్ 29
కేంద్రం తీరుతో తెలంగాణ రైతాంగానికి నష్టం వాటిల్లుతున్నదని టీఆర్‌ఎస్‌ లోక్‌సభ పక్ష నేత నామా నాగేశ్వర్‌రావు అన్నారు. తెలంగాణను, రైతులను, తెలంగాణ ప్రభుత్వాన్ని కేంద్రం అవమానిస్తుందని ఆరోపించారు.  సోమవారం ఆయన ఢిల్లీలో మాట్లాడుతూ రెండు నెలలుగా కేంద్రంతో చర్చలు జరుపుతుంటే.. కేంద్రం చేతులెత్తివేసిందని విమర్శించారు. దేశ రైతాంగం రోడ్లపై ఉంటే.. ఇప్పుడు తెలంగాణ రైతాంగం రోడ్డున పడేలా చేస్తున్నారన్నారు. పార్లమెంట్‌లో పంట కొనుగోళ్లపై వాయిదా తీర్మానాలు ఇస్తే, స్పీకర్‌ తిరస్కరించారన్నారు.పంటల కొనుగోళ్లపై చర్చకు నిరాకరించడంతో ఆందోళన చేశామని, వ్యవసాయ చట్టాల రద్దు బిల్లు కూడా ఏకపక్షంగా చర్చ లేకుండా ఆమోదించారన్నారు. వ్యవసాయ చట్టాల రద్దు బిల్లుపై చర్చ లేకుండా చేశారన్నారు. సీఎం కేసీఆర్‌ మూడు రోజులు ఇక్కడే ఉంది కేంద్రాన్ని ఒప్పించే ప్రయత్నం చేశారని గుర్తు చేశారు.ఏడేళ్ల కాలంలో అనేక కార్యక్రమాలు చేపట్టి రైతాంగాన్ని బలోపేతం చేశామని తెలిపారు. పంటల సాగు, ఉత్పత్తి పెంచేందుకు అనేక చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. మళ్లీ పార్లమెంట్‌ ఉభయ సభల్లో తెలంగాణ రైతాంగ సమస్యలను లేవనెత్తుతామన్నారు.కనీస మద్దతు ధరకు చట్ట బద్ధత తీసుకురావాలని కేంద్రాన్ని డిమాండ్‌ చేశారు. తెలంగాణ రైతాంగానికి సంబంధించిన అంశం కాబట్టి మిగతా పార్టీల ఎంపీలు కుడా తమతో కలిసి రావాలని కోరారు. తెలంగాణ ఎంపీలంతా ఉభయసభల్లో కలిసి పోరాడాలన్నారు. లేదంటే రైతుల ఆగ్రహానికి గురవుతారని, రానున్న కాలంలో మిమ్మల్ని నమ్మే పరిస్థితి ఉండదంటూ హితవు పలికారు.

Previous articleఎలాంటి పరిస్థితి ఉత్పన్నమైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి రాష్ట్ర వైద్యారోగ్యశాఖను ఆదేశించిన సీఎం కేసీఆర్‌
Next articleపంటల సేకరణలో జాతీయ విధానం తేవాలి : కేకే

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here