న్యూఢిల్లీ నవంబర్ 30
ధాన్యం సేకరణపై కేంద్రం స్పష్టమైన విధానాన్ని ప్రకటించాలని తెలంగాణ రాష్ట్ర సమితి ఎంపీలు మరోసారి లోక్‌సభలో డిమాండ్ చేశారు. ఇవాళ మధ్యాహ్నం రెండు గంటలకు సభ ప్రారంభమైన తర్వాత.. టీఆర్ఎస్ ఎంపీలు స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి నినాదాలు చేశారు. మార్కెట్ యార్డుల్లో ఉన్న ధాన్యాన్ని సేకరించాలని కోరారు. ప్లకార్డులను ప్రదర్శిస్తూ.. ధాన్య సేకరణపై జాతీయ విధానాన్ని ప్రకటించాలని డిమాండ్ చేశారు. స్పీకర్ చైర్‌లో కూర్చున్న ఏ రాజా.. టీఆర్ఎస్ ఎంపీలను శాంతింపచేసేందుకు ప్రయత్నించారు. రాజా ఎంత కోరినా తెలంగాణ ఎంపీలు వెనుదిరగలేదు. దీంతో 3 గంటల వరకు సభను వాయిదా వేశారు. ఇవాళ ఉదయం కూడా టీఆర్ఎస్ ఎంపీలు వెల్‌లోకి దూసుకువెళ్లి కేంద్రానికి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే.
Home జాతీయ వార్తలు ధాన్యం సేకరణపై కేంద్రం స్పష్టమైన విధానాన్ని ప్రకటించాలి స్పీకర్ పోడియం వద్దకు...