చిత్తూరు, అక్టోబర్ 08
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ఈ నెల 11 మరియు 12 వ తేదీలలో ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి చిత్తూరు జిల్లాకు రానున్నారని జిల్లా కలెక్టర్ యం. హరి నారాయణన్ నేడు ఒక ప్రకటన లో తెలిపారు. ఈ నెల తేది 11న సోమవారం మ.2.10 గం.లకు గన్నవరం నుండి బయలుదేరి మ. 2.55 గం.లకు రేణిగుంట విమానాశ్రయం చేరుకుంటారు. తదుపరి మ. 3.30 గం లకు తిరుపతి లోని బర్డ్స్ ఆసుపత్రి చేరుకుని శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలయం ఆసుపత్రి ప్రారంభోత్సవం, సా. 4.00 గం.లకు అలిపిరి శ్రీవారి పాదాలు చేరుకుని అలిపిరి మెట్ల మార్గాన్ని మరియు గో మందిరం ను ప్రారంభోత్సవం చేసి సా. 5.00 గం.లకు తిరుమల శ్రీ పద్మావతి అతిథి గృహం చేరుకుంటారు. సా. 5.50 గం. లకు బేడి ఆంజనేయ స్వామి ఆలయం చేరుకుని అక్కడి నుండి శ్రీవారికి పట్టు వస్త్రాలను తీసుకుని బయలుదేరి శ్రీవారికి సమర్పించి పూజా కార్యక్రమాల్లో పాల్గొని, రా. 7.15 గం. లకు తిరుమల శ్రీ పద్మావతి అతిథి గృహం చేరుకుని రాత్రి బస చేస్తారు. మంగళవారం తేది.12న ఉ.5.30 గం.లకు మరోమారు శ్రీవారిని దర్శించుకుని ఉ. 6.25 గం. లకు గొల్ల మండపం వద్ద నుండి ఎస్. వి. బి. సి. కన్నడ మరియు హింది ఛానల్ ను ప్రారంభించి, ఉ. 6.50 గం. లకు కొత్తగా నిర్మించిన బూందీ పోటును ప్రారంభిస్తారు. ఉ.7.20 గం.లకు అన్నమయ్య భవన్ లో గౌ. ముఖ్యమంత్రికి టి. టి. డి. అమలు చేస్తున్న నూతన కార్యక్రమాలను వివరించి , టి టి డి మరియు రాష్ట్ర ప్రభుత్వ రైతు సాధికారక సంస్థ మధ్య చేసుకునే ఎం. ఓ. యు కార్యక్రమం లో పాల్గొననున్నారు. . ఉ. 8.05 కు పద్మావతి అతిథి గృహం చేరుకుని ఉ. 9 గం లకు తిరుమల నుండి బయలుదేరి 10.15 గం. లకు రేణిగుంట విమానాశ్రయం చేరుకుని ప్రత్యేక విమానంలో గన్నవరం తిరుగు ప్రయాణం కానున్నారని కలెక్టర్ ఆ ప్రకటనలో తెలిపారు.