మందమర్రి. అక్టోబర్ 01
పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని పరిసరాల శుభ్రత పాటిస్తే అందరూ ఆరోగ్యంగా ఉంటారని మందమర్రి ఏరియా చింతల శ్రీనివాస్ పేర్కొన్నారు. శుక్రవారం కార్యాలయంలో స్వచ్ఛ పక్వాడా కార్యక్రమం నిర్వహించారు.ఈ ఈ కార్యక్రమానికి జి ఎం శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరు స్వచ్ఛ్ పక్వాడా కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని పర్యావరణ పరిరక్షణలో భాగంగా నాటిన మొక్కలను పరిరక్షించే బాధ్యత తీసుకోవాలని ఆయన అన్నారు. అదేవిధంగా గనులు కార్యాలయాలు పరిశుభ్రంగా ఉంచుతూ సింగరేణీయులు ఇతరులకు ఆదర్శంగా ఉండాలని ఆయన తెలిపారు. ఉద్యోగులు వారి గృహాలతో పాటు పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుతూ ప్లాస్టిక్ ను వాడడం నిషేధించాలని ప్రస్తుతం ప్రపంచాన్ని పీడిస్తుంది వాతావరణ కాలుష్యం అని గ్లోబల్ వార్మింగ్ తో ప్రపంచ దేశాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారని అన్నారు.ఈ కార్యక్రమంలో ఎస్ ఓటు జిఎం గోపాల్ సింగ్, ఏఐటీయూసీ బ్రాంచ్ సెక్రెటరీ సత్యనారాయణ,పిఎం వరప్రసాద్, పర్యావరణ అధికారి ప్రభాకర్, సీనియర్ పిఓ మైత్రేయ బంధు, జిఎం కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.