జగిత్యాల డిశంబర్ 01
నవంబర్ 25 నుంచి అంతర్జాతీయ మహిళా హింస వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని నవంబర్ 25 నుండి డిసెంబర్ 10 వరకు మహిళలు, బాలికలపై లింగ ఆధారిత హింసకు వ్యతిరేకంగా 16 రోజుల క్రియాశీలత అవగాహన కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ ను బుధవారం జగిత్యాల జిల్లా కలెక్టర్ రవి ఆవిష్కరించారు. ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి బోనగిరి నరేష్ , సఖీ అడ్మిన్ మనీల, కౌన్సిలర్ గౌతమి, పారామెడికల్ వర్కర్ సహుజ నరేష్ తదితరులు పాల్గొన్నారు.