జగిత్యాల, అక్టోబర్ 12
జిల్లోని ప్రతి గ్రామం, మండలం మరియు మున్సిపాలిటి వారిగా షిఫ్టెడ్, డెత్ అయిన వారు మినహ అర్హులైన ప్రతిఒక్కరికి వ్యాక్సిన్ అందించాలని జిల్లా కలెక్టర్ జి. రవి అన్నారు. మంగళవారం కలెక్టర్ శిభిర కార్యాలయం నుండి మండల ప్రత్యేకాధికారులతో కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమంపై జూమ్ వెబ్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో 140 రూరల్, 65 అర్బన్ టీంల ద్వారా వ్యాక్సిన్ అందించడం జరుగుతున్నదని, వ్యాక్సినేషన్ ప్రక్రియలో అధికారులు ఇంకా కృషిచేసి లక్ష్యాన్ని తోరలో సాదించాలని తెలియచేసారు. ఓటరు జాబితా, పోలీంగ్ కేంద్రం వారిగా గ్రామం లేదా మండలంలో ఎంత మందికి వ్యాక్సిన్ అందించడం జరిగింది, ఇంకా వ్యాక్సిన్ అందించాల్సిన వారు ఎంతమంది ఉన్నారొ గుర్తించి, వారందరికి కూడా వ్యాక్సిన్ తీసుకునేలా క్షేత్రస్థాయిలో ప్రత్యేక అధికారులు, వారి బృందాలు గ్రామంలో పర్యటించి అవగాహన కల్పించాలని అన్నారు. పిహెచ్సి సబ్ సెంటర్ వారిగా కోవిన్ యాప్ లో నమోదైన వ్యాక్సినేటెడ్ నివేధికను పోలీంగ్ కేంద్రం, ఓటరు జాబితా ఆదారంగా సరి చూసుకోవాలని, ఓటరు జాబితా ఆదారంగా లక్ష్యాన్ని నిర్ణయించుకోవాలని, తద్వారా వ్యాక్సినేషన్ పై అధికారులకు స్పష్టమైన అవగాహన వస్తుందని తెలియజేశారు.
ఇతర ప్రాంతాలలో ఉన్నవారిని గుర్తించి వారు వ్యాక్సిన్ తీసుకున్న వివరాలు తెలుసుకోవాలని, క్షేత్రస్థాయిలో అధికారులు పర్యటించి ప్రతిఒక్కరు వ్యాక్సిన్ తీసుకునేలా చూడాలని, క్షేత్రస్థాయి డోర్ టు డోర్ సర్వేలో ప్రజా ప్రతినిధులను బాగస్వాములను చేసి 100% వ్యాక్సిన్ జరిగేలా చూడాలని, ఇదివరకే వ్యాక్సిన్ తీసుకుని, మీదగ్గర వాటికి సంబంధించిన వివరాలు అందుబాటులో లేనట్లయితే వారిదగ్గర ఉన్న దృవీకరణల ఆధారంగా నివేదికలో నమోదు చేయాలని, 18 సంవత్సరాలు నిండి ఓటరు జాబితాలో నమోదు కాని వారిని గుర్తించి వారికి కూడా వ్యాక్సిన్ అందించాలని, అతి తక్కువ వ్యాక్సిన్ అయి ఉన్న గ్రామాలపై అధాకారులు ప్రత్యేక క్యాంపులు నిర్వహించి ప్రతిఓక్కరు వ్యాక్సినేట్ అయ్యేలా చూడాలని, ఎవైన సమస్యలు ఉన్నట్లయితే తెలియజేయాలని, వ్యాక్సిన్ పూర్తియిన ఇళ్లకు స్టిక్కర్లు అంటించాలని తెలియజేశారు.