ఖమ్మం,
నగరంలో మూడవ పట్టణం శ్రీనివాస్ నగర్ లో సోమవారం నాడు 15 , 27 వ డివిజన్ ప్రాంతంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నేతృత్వంలో ఏర్పాటు చేసిన ఎస్బీఐ మినీ ఏటిఎం ను ముఖ్యఅతిథిగా 27 వ డివిజన్ కార్పొరేటర్ దొడ్డ నగేష్ పాల్గొని ప్రారంభించారు . అనంతరం వారు మాట్లాడుతూ డివిజన్ లో నివసించే వృద్ధులకు , వికలాంగులకు మరియు ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచి వారికి , ఎస్బీఐ మినీ ఏటీఎం సంస్థ నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు . ఈ మినీ ఏటీఎంలను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు . సంస్థ నిర్వాహకులు లలిత , సంధ్య శ్రీ లు పే పాయింట్ కస్టమర్లు ఈ ఏటీఎం సర్వీస్ పాయింట్ను ఏ విధంగా ఉపయోగించుకోవాలో డివిజన్ ప్రజలకు వివరించారు . అలాగే ఎస్బీఐ టెరిటరీ మేనేజర్ శ్రావణ్ మాట్లాడుతూ ఏపీవై , పీఎం ఎస్బీవై , పీఎంజేజేబివై ప్రాముఖ్యత గురించి తెలియజేశారు . ఈ కార్యక్రమంలో మెట్లు నవీన్ , ఎస్ కే షాఫీ , జి.నాగార్జున , ఉదయ్ , నాగరాజు తదితరులు పాల్గొన్నారు .