Home తెలంగాణ దేశ ఆర్ధిక వ్యవస్థ చిన్నాభిన్నం

దేశ ఆర్ధిక వ్యవస్థ చిన్నాభిన్నం

297
0

హైదరాబాద్
రాజ్యసభలో కాంగ్రెస్ పక్ష నేత మల్లిఖార్జన్ ఖర్గే సోమవారం మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, పీఏసీ కన్వీనర్ షబ్బీర్ అలీ, మాజీ పీసీసీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య, వి. హనుమంతరావు, వర్కింగ్ ప్రసిడెంట్ గీతారెడ్డి, ఏఐసీసీ కార్యదర్శులు, ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీ, సంపత్ కుమార్, ఏఐసీసీ జాతీయ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్, మాజీ రాజయ్య తదితరులు హజరయ్యారు. మల్లిఖార్జున ఖర్గే మాట్లాడుతూ 2 జీ స్కామ్ పై తప్పడు ప్రచారం చేశారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, రాందేవ్ బాబ వంటి వారు కూడా తప్పుడు ప్రచారం చేశారు. సంజయ్ నిరుపమ్ మీద వినోద్ రాయ్ కోర్టు కు అఫిడవిట్ దాఖలు చేశారు. 2 జీ స్కామ్ పై కొందరు కావాలనే కుట్ర పూరితంగా విష ప్రచారం చేశారు. ప్రత్యేక న్యాయస్థానం కూడా 2 జీ స్కామ్ ఆధారాలు లేవని స్పష్టం చేసిందని అన్నారు. పెద్ద నోట్ల రద్దు చేసి నేటికి 5 ఏళ్ళు అయ్యింది. పెద్ద నోట్ల రద్దు చేసిన నాడు దేశానికి చీకటి రోజు. అనేక పరిశ్రమలు మూత పడి లక్షలాది ఉద్యోగాలు పోయాయి. ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అయ్యింది.  నోట్ల రద్దు వల్ల ఆర్థిక వ్యవస్థ సర్వనాశనం అయ్యింది. పెట్రోల్, డీజిల్ ధరలపై లీటర్ పైన 5 నుంచి పది రూపాయలు తగ్గించి ప్రయోజనం లేదు. మూడు నెలల్లో కేంద్రం పెట్రోల్, డీజిల్ పైన లక్షా 92 వేల కోట్ల రూపాయలు ఆదాయం పొందారు. తగ్గించిన ధరల వల్ల 13 వేల కోట్ల రూపాయలు మాత్రమే తగ్గుతాయి.  చాలా ఆలస్యం అయ్యింది… చేసిన సెస్ రద్దు కూడా తక్కువే అన్నీ అబద్ధపు మాటలతో బీజేపీ కాలం వెల్లదీస్తోందని విమర్శించారు.

Previous articleనవంబర్ 26న ‘1997’ సినిమా విడుదల
Next articleగట్టిగా ఎవరు మాట్లాడితే వాళ్లు దేశద్రోహులా?: సీఎం కేసీఆర్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here