Home నగరం కారు ఢీకొనడం తో వంతెన పైనుంచి ఎగిరి పడి దంపతులు మృతి

కారు ఢీకొనడం తో వంతెన పైనుంచి ఎగిరి పడి దంపతులు మృతి

153
0

బెంగళూరు సెప్టెంబర్ 15
కర్ణాటక రాజధాని బెంగళూరులో మంగళవారం రాత్రి ఘోర ప్రమాదం జరిగింది. బైక్‌పై వెళ్తున్న దంపతులను వేగంగా వచ్చిన కారు ఢీకొట్టదం తో  వారు వంతెన పైనుంచి ఎగిరి కింద పడి మరణించారు. తమిళనాడుకు చెందిన ఒక జంట బైక్‌వై వెళ్తూ ఎలక్ట్రానిక్ సిటీ ఫ్లైఓవర్‌ మధ్యలో ఒక పక్కగా ఆగారు. ఇంతలో వేగంగా వచ్చిన కారు వారిద్దరిని ఢీకొట్టింది. దీంతో ఆ దంపతులు 30 అడుగుల ఎత్తులో ఉన్న వంతెన పైనుంచి ఎగిరి కింద పడ్డారు. వారిద్దరు అక్కడికక్కడే చనిపోయారు.ఆ కారును ఒక యువకుడు నడిపినట్లు సమాచారం. మరో కారును ఓవర్‌టేక్‌ చేయబోయి అదుపుతప్పి బైక్‌పై ఉన్న దంపతులను వేగంగా ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో గాయపడిన అతడు ఆసుపత్రిలో చికిత్స పొంది కోలుకుంటున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Previous articleఇంజనీరింగ్ విద్య లో వేములవాడకు చెందిన అశ్విత కు గోల్డ్ మెడల్
Next articleనిందితుడు రాజు ఆత్మహత్య

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here